పులివర్తి పొలిటికల్ కలకలం.. చంద్రబాబు చోద్యం.. !
దీంతో ప్రజలంతా పులివర్తివైపే నడిచారు. అంతేకాదు.. ఆయనపై సానుభూతి పవనాలు కూడా వీచాయి. ఇక, ఎన్నికల తర్వాత కూడా.. పులివర్తి నాని రాజకీయంగా సానుభూతి పొందారు. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ సమయంలో తనపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హత్యాయత్నం చేశారంటూ.. హల్చల్ చేశారు. దీంతో సర్కారు అప్రమత్తమై మోహిత్ రెడ్డిని అరెస్టు చేయాలని చూసింది. కానీ, తెరచాటున చెవిరెడ్డి వర్గంతో నాని.. చేతులు కలిపారు. ఈ కేసు ఎటు పోయిందో కూడా ఎవరికీ తెలియదు.
ఇక, కూటమి సర్కారు వచ్చిన నాలుగు మాసాల్లో పులివర్తి నాని కేంద్రంగా మాత్రం రాజకీయ వివాదాలు తెరమీదికి వస్తున్నాయి. నీకిది.. నాకిది అన్నట్టుగా పులివర్తి ఫ్యామిలీ లెక్కలు వేస్తోంది. అందిన కాడికి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని.. దూకుడు పెరిగిందని, దందాలు సాగుతున్నాయని .. టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడం గమనార్హం. వాస్తవానికి చంద్రగిరి నియోజక వర్గానికి మంచి పేరుంది.
గత పదేళ్లుగా ఇక్కడ నుంచి గెలిచిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి.. ఉద్యోగుల జోలికి పోలేదు. సాధారణ ప్రజల జోలికి కూడా పోలేదు. సాధ్యమైనంత వరకు వారికి మంచి చేశారు. ప్రతి సంక్రాంతి, దసరాకు.. పారిశుధ్య కార్మికులు నియోజకవర్గంలో ఎంత మంది ఉంటే అంత మందికీ బట్టలు పెట్టి కానుకలు ఇచ్చేవారు. ఇక, చిరుద్యోగులకు కూడాసంక్రాంతి కానుకలు ఇచ్చేవారు. ఎవరి నుంచి సొమ్ములు ఆశించలేదు.
దీంతో ఏ పనికావాలన్నా.. రూపాయి లంచం లేకుండా.. ప్రజలకు చేరువైంది. కానీ, ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. నేరుగా పులివర్తి కుటుంబం రంగంలోకి దిగి... రేట్లు కట్టేయడం.. సొమ్ములు కావాలని బహిరం గంగానే ప్రకటించడం వంటివి టీడీపీకి మైనస్‌గా మారనున్నాయి. మంచి నియోజకవర్గంగా పేరు తెచ్చుకున్న చంద్రగిరిలో ఇప్పుడు నాని.. పనులు మకిలి అంటించేవిగా ఉన్నాయని టీడీపీలోనూ చర్చ సాగుతోంది. ఇలాంటివారిపై చంద్రబాబు ఉదాసీనంగా ఉంటారో.. చర్యలు తీసుకుంటా రో చూడాలి.