ఏపీలో 2027లోనే ఎన్నికలు..సంకేతాలు ఇవే ?
ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జమిలి ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఆయన డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి జమిలి ఎన్నికలకు సపోర్ట్ చేయాలని కూడా ప్రకటన చేయడం జరిగింది. అంటే ప్రాంతీయ పార్టీలకు గొడ్డలిపెట్టు గా ఉన్న జమిలి ఎన్నికలకు సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించి మరి... ఎన్నికలకు సిద్ధం అంటూ రెడీ అయ్యారు. దీంతో జమ్లి ఎన్నికలు మరింత తొందరగానే వస్తాయని కొంతమంది అంచనా.. వేస్తున్నారు.
2027 నాటికే.. ఈ ఎన్నికలు వస్తాయని కూడా కొంతమంది చెబుతున్నారు. అయితే 2027 లోపు ఎన్నికలు వస్తే ఏపీలో... జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా ? లేదా మళ్లీ చంద్రబాబు నాయుడుకు అధికారం వస్తుందా అనే చర్చ మొదలైంది. అయితేదీనికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు.. కూడా లెక్కలు చెబుతున్నారు. ఈ జెమినీ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు కచ్చితంగా తీవ్ర నష్టం వాటిలోతుందని చెబుతున్నారు. జాతీయ వాదం తెరపైకి వచ్చి ప్రాంతీయవాదం అనేది తగ్గిపోతుందని అంటున్నారు.
ఈ సమయంలో ఇప్పటికే మోడీతో చంద్రబాబు సఖ్యతగా ఉన్నారు. అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే ఏపీలో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీతో వెళ్తే... జగన్కు కచ్చితంగా స్కోప్ ఉంటుందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ వైపు జగన్ అడుగులు వేస్తే ఆయనకు కూడా మంచి ఫలితాలు ఉంటాయని... అంచనా వేస్తున్నారు.