మండలి చీఫ్ విప్‌గా పట్నం..రేవంత్ సర్కార్ కు ఎదురుదెబ్బ ?

Veldandi Saikiran

తెలంగాణ రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితులు  జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అధికార దుర్వినియోగం జరుగుతోందని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అక్రమంగా తమ పార్టీ నేతలను పదిమందిని చేర్చుకున్నారని... అంతేకాదు వారికి కీలక పదవులు ఇస్తున్నారని కూడా చెబుతున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి గెలిచిన అరికపూడి గాంధీకి... ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాల్సిన పీఏసీ పదవిని అప్పగించారు.
 

అరికపూడి గాంధీ వాస్తవంగా గులాబీ పార్టీ నేత. గులాబీ పార్టీ టికెట్ పైన గెలవడం జరిగింది.అయితే అలాంటి అరికపూడి గాంధీ... ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  పార్టీ మారిన అరికపూడి గాంధీకి ఈ పదవి ఇవ్వకూడదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అవకతవకలు అలాగే అవినీతి గురించి ప్రశ్నించే బాధ్యత పూర్తిగా పిఏసికి ఉంటుంది. అలాంటి పదవి అరికెపూడి గాంధీకి ఇచ్చి రేవంత్ రెడ్డి పెద్ద తప్పిదమే చేశారు.
 

అయితే ఇది మరవకముందే మరో గులాబీ పార్టీ ఎమ్మెల్సీకి... కాంగ్రెస్ కండువా కప్పి... మండలిలో చీఫ్ విప్ పదవి ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి... కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు పట్నం మహేందర్ రెడ్డి. వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి కి...విప్ పదవి ఇచ్చి... రేవంత్ రెడ్డి మరో తప్పిదం చేశాడని హరీష్ రావు కూడా ఫైర్ అవుతున్నారు. పార్టీ మారినందుకుగాను మహేందర్ రెడ్డి పై ఇప్పటికే కోర్టులో కేసు వేసింది గులాబీ పార్టీ.
 

ఇలా కేసు కోర్టులో ఉన్నప్పుడే అధికారిక పదవులు ఎలా ఇస్తారని... హరీష్ రావు నిలదీస్తున్నారు. పార్టీ మారిన దొంగలకు ... ప్రభుత్వ పదవుల్లో ఉండి బిల్లులు పాస్ చేయించడం, అలాగే మండలిలో ప్రభుత్వ కార్యకలాపాలు   చూసే బాధ్యత ఇస్తారా? అని పట్నం మహేందర్ రెడ్డి పైన అలాగే రేవంత్ రెడ్డి పైన ఆగ్రహించారు. దీనిపై కోర్టుకు వెళ్తామని... రేవంత్ రెడ్డి బరతం పడతామని హరీష్ రావు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: