ఏపీ: కూటమి ప్రభుత్వంపై జగన్ మరో సంచలన ట్విట్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అంటూ ప్రశ్నించారు.. లభిస్తే అది ఎక్కడో చెప్పగలరా అంటూ కూడా నిలదీయడం జరిగింది.. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులు అయిన వస్తు ఉండేవి కానీ ఇప్పుడు అలాంటిది కూడా ఏమీ లేదు ఇసుక కొందామంటే తమ ప్రభుత్వంలో కంటే మరింత రేటు ఎక్కువగా ఉందని కూలీలు ,కాంట్రాక్టర్లు, ఇల్లు నిర్మించుకుందామనుకునేవారు, ప్రజలు వాపోతున్నారు అంటూ తెలిపారు.. ఉచిత ఇసుక ఇస్తామంటూ ఊరురా డప్పు కొట్టుకొని చెప్పారు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు అంటూ ఇది ప్రజలను మోసం చేయడం కాదా అంటూ ప్రశ్నించారు.
భరించని రేట్లతో ప్రజలను అష్ట కష్టాలను చేస్తున్నారంటే ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటిలోనే టిడిపి కూటమి పార్టీలకు చెందిన చాలామంది నేతల చూపు మొత్తం కూడా ఇసుక నిల్వల పైనే ఉన్నది.. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ప్రభుత్వంలో స్టాక్ యార్డ్ లను ఉంచితే .. సుమారుగా 80 లక్షల టన్నులు ఇసుకలో సగభాగం మీ ప్రభుత్వం వచ్చిన నెల రోజులు గడవకముందే మాయం చేశారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూటమి పార్టీ నేతలు దోచేస్తున్నారు అంటూ ఒక సంచలన ట్విట్ చేశారు.