పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులకు దూరం.. రతన్ టాటా బాల్యం ఎలా గడిచిందో తెలుసా?
రతన్ టాటా పూర్తి పేరు రతన్ నావల్ టాటా. టాటా సన్స్ అనే కంపెనీకి ఆయన చైర్మన్‌గా పనిచేస్తూ ఎన్నో కొత్త కంపెనీలను స్థాపించారు. 1937 డిసెంబర్ 28న జన్మించారు. ఆయన తండ్రి నావల్ టాటా, తల్లి సోని కమిసారిట్. ఆయనకు జిమ్మీ టాటా అనే తమ్ముడు కూడా ఉన్నారు. రతన్‌కు పది సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆపై రతన్ కొంతకాలం ఒక అనాథాశ్రమంలో ఉన్నారు. ఆయన గ్రాండ్ మదర్ నవాజ్ బాయి టాటా ఆయన్ని దత్తత తీసుకున్నారు.
రతన్ టాటా తండ్రి సిమోన్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి నోయల్ టాటా అనే కొడుకు పుట్టాడు. రతన్ తన చిన్నతనంలో తన సొంత తమ్ముడితో పాటు సవతి తమ్ముడు తో కూడా ఆడుకున్నారు. రతన్ 8వ తరగతి వరకు ముంబైలోని ఒక స్కూల్లో చదివారు. ఆ తర్వాత ముంబైలోనే మరో స్కూల్లో టెన్త్ పూర్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా కొంతకాలం చదువుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఒక స్కూల్ నుంచి 1955లో పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోనే మరో యూనివర్సిటీ నుండి ఆర్కిటెక్చర్ కోర్సులో బ్యాచిలర్స్ పట్టా పొందారు.
ఆయన చాలా విజయవంతమైన వ్యాపారవేత్త. మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి. 2008లో ఆయన చదివిన యూనివర్సిటీకి 50 మిలియన్ డాలర్లు దానం చేశారు. అదే ఆ యూనివర్సిటీకి ఇచ్చిన అతిపెద్ద దానం. రతన్ టాటా కాలంలో టాటా గ్రూప్ చాలా పెద్ద కంపెనీగా మారింది.
టాటా గ్రూప్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఈ కంపెనీ జాగ్యువార్, ల్యాండ్ రోవర్ లాంటి బాగా ధరైన కార్లు, టీ పౌడర్, ఉప్పు, పెద్ద పెద్ద షిప్‌లు, విమానాలు ఇలా చాలా రకాల వస్తువులు తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఇంత పెద్దగా ఎదగడానికి రతన్ టాటానే కారణం. రతన్ చాలా మందికి ఆదర్శం. ఆయన ఎప్పుడూ "నాకు డబ్బు లేదా అధికారం మీద ప్రేమ లేదు. నాకు నేను నిజాయితీగా ఉండటం మాత్రమే ముఖ్యం. నేను ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటాను అని నేను చెప్పను. ముందుగా ఒక నిర్ణయం తీసుకుంటాను, ఆ తర్వాత దాన్ని బాగా అమలు చేస్తాను." అని అన్నారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలకు 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అనే పురస్కారం ఇచ్చింది. ఆ తర్వాత 2008లో దేశంలో రెండవ అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషణ్ అనే పురస్కారం ఇచ్చింది.