ఏపీ:హర్యానా ఎన్నికలపై జగన్ సంచలన ట్విట్..!

frame ఏపీ:హర్యానా ఎన్నికలపై జగన్ సంచలన ట్విట్..!

Divya
ఇటీవలే జమ్ము కాశ్మీర్ ,హర్యానా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.. ముఖ్యంగా హర్యానా ఎన్నికల ఫలితాల పైన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగానే ఈ ఎన్నికల ఫలితాలు ఉంటున్నాయని ఏపీలో లాగే హర్యానాలో కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయంటూ తెలియజేస్తున్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాలను కూడా చాలా గందరగోళానికి గురి చేస్తున్నాయంటూ తెలియజేశారు. ఆంధ్ర ఎన్నికల ఫలితాల పైన ఇప్పటికే కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయని తెలిపారు.

అలాగే పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సైతం వినియోగించడం సరైన పద్ధతి కాదని దేశంలో పేపర్ బ్యాలెట్స్ ద్వారా ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది అంటూ తెలియజేశారు. అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఇప్పటికీ ఇలాంటి పేపర్ బ్యాలెట్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. అమెరికా, న్యూజిలాండ్ ,యూకే ,జర్మన్, ఫ్రాన్స్, స్విజర్లాండ్ ఇతరత్రా ప్రాంతాలలో కూడా పేపర్ బ్యాలెన్స్ ని ఉపయోగిస్తున్నారంటూ తెలిపారు. అలాంటప్పుడు మనం కూడా ఎందుకు ఈ పేపర్ బ్యాలెట్ కి వెళ్లకూడదు అంటూ  తెలిపారు.

అప్పుడే ఓటర్లలో విశ్వాసం కూడా పెరుగుతుందని ఓటర్ల విశ్వాసాన్ని నింపేందుకు సైతం చట్టసభలలో ముందుకు రావాలి అంటూ వైయస్ జగన్ ఒక సంచలన ట్వీట్ చేశారు. హర్యానా ఎన్నికలలో బిజెపి హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఫలితం తలకిందులు చేస్తూ పోస్టల్ బ్యాలెట లో అధికంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపులో వెనుకబడింది.. మొత్తం మీద అక్కడ 90 స్థానాలు ఉన్నప్పటికీ బీజేపీ 48 గెలుచుకోక కాంగ్రెస్ 37కు పరిమితమైంది. మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారు మారవుతూ ఉన్నాయి.. మరి ఇలాంటి సమయంలో పేపర్ బ్యాలెట్ కు వెళ్తారా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: