ఏపీ: కూటమిలో కుమ్ములాట..మాజీ బిజెపి ఎమ్మెల్యే రాజీనామా..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని కూటమిలో భాగంగా బిజెపి పార్టీకి తాజాగా ఒక షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ ఇటీవలే బిజెపి పార్టీకి రాజీనామా చేసినట్లుగా వార్తల వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన స్వయంగానే ప్రకటించారు. అయితే తనకు ప్రధాన మోడీ అంటే చాలా మక్కువ అని తెలియజేశారు కానీ ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే తాను బిజెపి పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నానంటూ తెలియజేశారు ప్రకాష్ జైన్.

అలాగే బిజెపి నాయకులు చేసినటువంటి అవినీతి పైన కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఎవరు సరైన ఫలితం అందించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యానంటూ తెలిపారు ప్రకాష్ జైన్.. ఆదోని నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి.. ఆదే నియోజకవర్గంలో బిజెపి పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు తమ సొంత లాభం కోసం పార్టీని ఎదగనీయకుండా తొక్కేస్తున్నారు అంటూ వాపోతున్నారు. ఈ విషయంపైన ఎన్నోసార్లు బిజెపి రాష్ట్ర కమిటీకి తెలియజేసిన కూడా వారు ఎవరు స్పందించలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదని తెలిపారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి నేతలు రాజీనామా చేసి టిడిపి, బిజెపి ,జనసేన పార్టీలోకి చేరుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ మాత్రం బిజెపి పార్టీకి గుడ్ బై చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.మొదటిసారిగా ఈయన 1977లో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1992లో టిడిపిలో చేరగా శాసనసభ్యునిగా గెలవడం జరిగింది.1995 నుంచి 2004 వరకు కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెట్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 40 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందించిన ఈయన 2014లో బిజెపి పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడంతో మరి ఆయన మరో పార్టీలోకి చేరుతారా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: