అమ‌రావ‌తి ఏపీకి రాజ‌ధాని అవ్వ‌దా... ఈ కొత్త ట్విస్ట్ ఏంటి బాబోయ్‌...!

RAMAKRISHNA S.S.
ఏపీ రాజధాని అంటే అమరావతి అన్న క్రేజ్ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకువచ్చారు. కొంత పనులు కూడా జరిగాయి. అయితే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతిని తొలగించి ఆ స్థానంలో ఏపీకి మూడు రాజధానులు తీసుకువచ్చింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు రాజధానులు అని ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏది అని చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలల నుంచి అమరావతి రాజధాని అని మరోసారి ప్రకటించడంతో పాటు.. శరవేగంగా అక్కడ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది.

ఏపీకి రాజధాని కూటమి ప్రభుత్వం చెబుతోంది సరే.. అయితే దీనిని నోటిఫై చేస్తూ ఎక్కడ కేంద్ర హోం శాఖ నుంచి ఒక నోట్ కానీ.. ఆర్డర్ కానీ.. అధికారికంగా ఈరోజుకు లేదు. ఏపీ అమరావతి రాజధాని అని ఒక నోటిఫికేషన్ అయితే కేంద్ర హోంశాఖ నుంచి రావాల్సి ఉంది. అలా అధికారికంగా నోటిఫికేషన్ రానంతవరకు అమరావతి ఏపీకి రాజధానిగా లీగల్ గా గుర్తించబడదని.. దీనివల్ల భవిష్యత్తులో కూడా ఎన్నో సమస్యలు వస్తాయని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కట్టడం వరకు ఓకే. అయితే లీగల్‌గా చిక్కరు అన్ని తప్పించుకుని పనులు చేయాలి. కానీ.. అలా చేయకుండా ముందుకు వెళితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఎందుకంటే అమరావతి పేరు మీద భారీ ప్రాజెక్టులు.. ఇతర నిర్ణయాలు అన్నీ కూడా లీగల్ గా ప్రశ్నించబడతాయట. రాజధాని అన్న పేరుతోనే వీటిని చేస్తున్నారు. కానీ.. అమరావతి రాజధానిగా కేంద్రం గుర్తించినట్టుగా నోటిఫికేషన్ ఏది లేకపోవడంతో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న సందేహాలు అయితే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఏపీకి రాజధానిగా.. కేంద్ర హోంశాఖ ద్వారా నోటిఫికేషన్ తర్వాత ముందుకు వెళితే బాగుంటుందని ప్రతి ఒక్కరు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: