తెలంగాణ:ఐదేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి సీట్ లాగేస్తారా..నెక్స్ట్ సీఎం రేస్ లో వారేనా.?

Pandrala Sravanthi
-కేసీఆర్ పాలనలో అప్పుల పాలైన తెలంగాణ.
- మూడవ దశలో కాంగ్రెస్ కు పట్టం.
- మార్కు పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు  కేసీఆర్ సీఎంగా పని చేశారు. ఆయన హయాంలో  తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ చెబుతూ  7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టాడు. అభివృద్ధి పనులు మూడైతే, అప్పులు 6 అన్నట్టు తయారైంది తెలంగాణ పరిస్థితి. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి ఎన్నికల్లో  ప్రజలంతా విషయాన్ని తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించింది. అలాంటి రేవంత్ సీఎం అయిన తర్వాత అప్పుల దాటిని తట్టుకొని వారు అమలు చేస్తామన్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలు కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మార్క్ పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. ఆయన సొంత పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతున్న అధిష్టానం అండతో ముందుకు వెళుతున్నారని చెప్పవచ్చు. ఈ విధంగానే రేవంత్ ఐదు సంవత్సరాలు పాలిస్తే మాత్రం మరోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అవుతారా  లేదా అనేది తెలుసుకుందాం..
 ఐదేళ్ల తర్వాత రేవంత్ పరిస్థితి:


 ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఇందులో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి ఇలా ఎంతోమంది నేతలు సీఎం సీట్ కోసం ఎదురుచూస్తున్నారు.  కానీ అధిష్టానం గ్రహించి ఎన్నికలకు ముందు రేవంత్ అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి,  టిపిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సీఎంను చేసింది. దీంతో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసమే ఆరు గ్యారెంటీలు అమలు కోసం ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఓవైపు అప్పులకు వడ్డీలు కడుతూ మరోవైపు  ఉచిత బస్సు, ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, వంటి పథకాలను అమలు చేశారు.  ఇంకా మహిళలకు 2500 పింఛన్ల పెంపు, ఇందిరమ్మ ఇండ్లు, వంటి పథకాలు అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ విధంగా రాష్ట్రాన్ని మరింత అప్పులు పాలు కాకుండా, పథకాల అమలు కోసం ప్లాన్ ప్రకారం బడ్జెట్ ఏర్పాటు చేసుకొని రేవంత్ పాలన చేస్తున్నారు.  ఆయన ఎంత మంచి పాలన చేసినా కానీ కిందున్న స్థాయి నేతలు మాత్రం ఏదో ఒక రకంగా విమర్శించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా రేవంత్ ఐదు సంవత్సరాల పాటు మార్కు పాలన కొనసాగిస్తే  వచ్చే 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ఉంచకపోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నేతల్లో ఎవరో ఒకరికి సీఎం పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: