తాగుబోతుల తెలంగాణ: గల్లికో దుకాణం పెట్టిన రేవంత్..?

Veldandi Saikiran
* తెలంగాణలో భారీగా పెరిగిన వైన్స్ సంఖ్య
*  బీర్లకు భారీగా పెరిగిన డిమాండ్
* అమ్మకాలు జోరుగా పెంచాలని వైన్స్ లకు టార్గెట్లు


తెలంగాణ రాష్ట్రం..  ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు... మద్యం అమ్మకాలు విపరీతంగానే పెరుగుతున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణకు తాగుబోతుల రాష్ట్రంగా పేరు కూడా వచ్చింది. చాలామంది.. కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారు. పుట్టిన, చనిపోయిన,  వాహనం కొన్న , ఇల్లు కొన్న  చిన్న ఫంక్షన్ చేసిన కూడా కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం తాగుతూ ఉంటారు. ఇక దసరా, బోనాల పండుగ, నూతన సంవత్సర వేడుకల సమయాల్లో కూడా... తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విపరీతంగా తాగుతారు.
దేశవ్యాప్తంగా తాగుబోతుల సంఖ్యను చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం... టాప్ లోనే ఉంటుంది. కెసిఆర్ 10 సంవత్సరాల పాలనలో కూడా.. వైన్స్ సంఖ్య పెంచి... విపరీతంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు.  మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతోనే సంక్షేమపథకాలను అమలు చేశారు.
ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత... తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరిగింది. గల్లికో వైన్స్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అంతేకాదు.... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా... బెల్టు షాపుల సంఖ్యను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఒక్క ఊర్లో... రెండు నుంచి మూడు బెల్ట్ షాపులు ఉంటున్నాయి. అర్ధరాత్రి తలుపు కొట్టిన మద్యం ఇచ్చే దుకాణాలు కూడా ఉన్నాయి. దీంతో కెసిఆర్ ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి సర్కార్ లోనే మద్యం ద్వారా ఆదాయం విపరీతంగా వస్తుంది.

వైన్స్ యాజమాన్లకు టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది సర్కార్. అతి త్వరలోనే మద్యం ధరలను కూడా పెంచే దిశగా అడుగులు వేస్తుందట రేవంత్ రెడ్డి సర్కార్. ఒక్కో బీరుపై 20 రూపాయలు... ఫుల్ బాటిల్ పైన 40 రూపాయల వరకు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మద్యం ధరలు పెరిగితే... ఆదాయం కూడా విపరీతంగా వస్తుంది. అటు తెలంగాణ మందుబాబులు కూడా...  తాగడానికి ఇంట్లో వస్తువులు కూడా అమ్మే పరిస్థితి వస్తుంది.  కానీ ఎన్నికల కంటే ముందు మద్యం అమ్మకాలను కట్టడి చేస్తామని కాంగ్రెస్ పదే పదే చెప్పింది. కానీ ఆచరణలో మాత్రం... కెసిఆర్ ను మించిపోయేలా... మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: