రేవంత్‌ కు జగ్గారెడ్డి వార్నింగ్‌..హైడ్రా రెక్కలు విరిచేస్తానంటూ ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం... హైడ్రా, మూసి పరివాహన ప్రాంతాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రెండు అంశాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. జనాలు తిరుగుబాటు చేసేలా... వ్యూహాలు రచిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా... హైదరాబాద్ నగరం మొత్తం నిరసనలు జరుగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది.
 

అయితే ఇలాంటి నేపథ్యంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... సరికొత్త వివాదానికి తెర లేపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైడ్రా రెక్కలు విరుస్తానని కూడా హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయని... రెండు రోజులుగా వార్తలు విన్నానని జగ్గారెడ్డి చెప్పడం జరిగింది.

అయితే సంగారెడ్డి నియోజకవర్గంలో హైడ్రా పేరుతో కూల్చివేతలు జరిగితే... చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. అలాంటి హైడ్రా సంగారెడ్డిలో ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా నన్ను కలవాల్సిందేనని తెలిపారు. సంగారెడ్డి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని కోరారు. హైడ్రా రాకుండా తాను అడ్డుకుంటానని జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. హైదరాబాద్ వస్తుందని సంగారెడ్డి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 

సంగారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి కూల్చివేతలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఎవరు కూడా భయాందోళనకు గురికాకూడదని కోరారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైడ్రా కూల్చివేతలపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తాను మాట్లాడతానని.. వినకపోతే తన ప్రతాపం ఏంటో చూపిస్తానని కూడా పరోక్షంగా హెచ్చరించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి తో పాటు దానం నాగేందర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.  కూల్చి వేసే ముందు మొదట బాధితులకు ఇండ్లు ఇవ్వాలని...  అప్పుడే వారికి న్యాయం జరుగు తుందని దానం నాగేందర్ కూడా పెదవి విరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: