జనసేన కేంద్ర మంత్రిగా ఆయన ఫిక్స్ ..?
అయితే నాగబాబు కు ఇప్పుడు రాజకీయంగా అదృష్టం మెయిన్ డోర్ తట్టబోతోంది. వైసీపీ నుంచి కృష్ణయ్య తన రాజ్యసభ పదవితో పాటు వైసిపికి అనూహ్యంగా రాజీనామా చేయటం అలా మూడో ఎంపీ సీట్లు కూడా ఖాళీ కావడంతో నాగబాబుకు లక్ చిక్కింది. కృష్ణయ్య తన నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలం వదులుకున్నారు. దీంతో పెద్దల సభలో నాలుగేళ్ల పదవీకాలం అంటే అది బంగారు పళ్లెంతో సమానం అని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఇద్దరు రాజ్యసభ వైసిపి ఎంపీలు రాజీనామా చేశారు. ఆ రెండు ఎంపీ సీట్లలో టిడిపి వారిని ఎంపిక చేయాలని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కృష్ణయ్య రాజ్యసభ పదవి ఖాళీ కావడంతో దానిని జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఈ క్రమంలోని జనసేన నుంచి నాగబాబు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారు. అదేకనుక జరిగితే నాగబాబుకు జనసేన కోటాలో కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే కనుక జరిగితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి కేంద్ర మంత్రి ... ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి .. డిప్యూటీ సీఎం గా ఉండడం.. నాగబాబు కూడా కేంద్రం మంత్రి కావడం... ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు అన్నదమ్ములు మంత్రులు అయిన రికార్డ్ సాధించినట్లవుతుంది.