దేవినేని ఉమాకు ఆ ప‌ద‌వి ఇస్తారా... ఆయ‌న కోరిక పెద్ద‌దేగా..?

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్రప్రదేశ్లో త్వరలో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచి తమ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ - బీద మస్తాన్ రావు - కృష్ణయ్యలు ఏదో ఒక పార్టీలో చేరిన వారిని రాజ్యసభకు పంపే అవకాశాలు లేవు. అందుకే టిడిపి - జనసేన లో కొత్త పేర్లు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. మూడు సీట్లలో ఒకటి కూటమి పార్టీలకు అందులోను జనసేనకు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆ పార్టీకి ఇస్తే నాగబాబు పేరు తప్ప మరో పేరు రేసులో ఉండే అవకాశం లేదు. ఇక టిడిపిలో రెండు స్థానాలకు చాలా పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు .. అలాగే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తో పాటు మరో మాజీమంత్రి దేవినేని ఉమా అలాగే గుంటూరు నుంచి వరుసగా రెండుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచి ఎన్నికల్లో సీటు వదులుకున్న గల్లా జయదేవ్ కొంటి పేర్లను టిడిపి వర్గాలు హైలైట్ చేస్తున్నాయి.

గల్లా జయదేవ్ కుటుంబ నేపథ్యం ఇటు వేధింపులు ఎదుర్కోవడంతో పాటు ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. కానీ పార్టీకి దూరం కాకపోవడం ఆయనకు ప్లస్. చట్టసభల్లో దాటిగా మాట్లాడగలగే నైపుణ్యం కూడా ఆయనకు కలిసి రానుంది. ఇక అశోక్ గజపతిరాజు ఈసారి ఎంపీ సీటు వదులుకున్నారు. ఆయన సీనియార్టీని గుర్తించాలని చంద్రబాబు అనుకుంటే కచ్చితంగా ఆయనకు రాజ్యసభ ఇవ్వ‌వచ్చు. ఇక దేవినేని ఉమా ఈసారి సీటు వచ్చి గెలిచి ఉంటే కచ్చితంగా మంత్రి అయ్యేవారు అనూహ్యంగా ఆయన తన మైలవరం సీటును త్యాగం చేశారు కచ్చితంగా ఆయన స్థాయికి తగిన పదవి ఇవ్వాలి అంటే రాజ్యసభ కరెక్ట్ అని అందరూ చెబుతున్నారు.

ఇక యనమల కూడా రాజ్యసభ మీద ఆశలు పెట్టుకున్న ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు చాలామంది పదవుల్లో ఉన్నారు. ఆయన కుమార్తె .. అల్లుడు .. వియ్యంకుడు పదవులలో ఉండడంతో య‌నమలకు మళ్ళీ అవకాశం ఇస్తారా అన్న సందేహాలు ఉన్నాయి. ఈ మూడు రాజ్యసభ పదవులు పూర్తి పదవీకాలం ఉన్నవి కావు .. నాలుగేళ్ల పదవీకాలం ఉన్నవి మాత్రమే సీనియర్లకు కేటాయిస్తే మరోసారి తర్వాత కూడా వారికే ఛాన్స్ ఇవ్వాలి .. అందుకనే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: