తిరుమల శ్రీవారి లడ్డు కల్తిలో రోజా వాటా 15% ?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి కల్తీ వివాదం.. గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరిని కదిలించినా తిరుమల శ్రీవారి లడ్డు గురించే మాట్లాడుకుంటున్నారు. తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు.. వాడి తయారు చేశారని... ఇదంతా వైసిపి ప్రభుత్వం హయాంలో జరిగిందని.. స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈ ప్రకటన చేయడంతో వివాదం పెద్దగా అయింది.
దీంతో ఈ విషయంలో వైసీపీ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తున్నప్పటికీ కూడా... జగన్ పై చేయి సాధించలేకపోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి రోజా పైన కమెడియన్ ఆర్ పి... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయింది వందకు వంద శాతం నిజమేనని ఆయన.. ఆరోపణలు చేయడం జరిగింది. అయితే దీని ద్వారా వచ్చిన డబ్బుల్లో 15% రోజాకు కూడా వెళ్ళింది ఆయన ఆరోపణలు చేశారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు రోజా.. విపరీతంగా అవినీతికి పాల్పడిందని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే కమెడియన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చిల్లర మాటలను ఎవరు నమ్మకూడదని కోరుతున్నారు. అయితే చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కొత్త స్కెచ్ వేశారు. స్వయంగా తిరుమలకు వెళ్లి... ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి.
ఎల్లుండి అంటే శనివారం... తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళనున్నారు. కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోను ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. అలా చేస్తే తనపైన ఉన్న... మరకను తొలగించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ వివాదం నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. క్రైస్తవ మతం కు సంబంధించిన జగన్మోహన్ రెడ్డి... శ్రీవారిని కాలినడకన దర్శించుకుంటే ఖచ్చితంగా హిందువులలో నమ్మకం కలుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.