జమిలి ఎన్నికలు: ప్రమాదంలో ప్రాంతీయ పార్టీలు ?

Veldandi Saikiran
* జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు దెబ్బ
* వైసిపి, టిఆర్ఎస్, టిడిపి లాంటి పార్టీలు కోలుకోవడం కష్టమే
* జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకోక తప్పదు
* ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే కూటమిగా ఏర్పడాల్సిందే

 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం... జమిలి ఎన్నికల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. గత వారం రోజుల కిందట మోడీ ప్రభుత్వం... జమిలి ఎన్నికలపై.. 100 అడుగులు ముందుకేసింది. జెమిలి ఎన్నికలకు సంబంధించిన.. బిల్లును రాష్ట్రపతికి పంపించింది. దీంతో 2026 లోపు దేశవ్యాప్తంగా జెమిలి ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై.. అందరూ ఆందోళన పడుతున్నారు.
 
నిజంగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే... దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా కష్టతరం అవుతుంది. జెమినీ ఎన్నికలు జరిగితే... ప్రధాని నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ  మధ్య ఫైట్ గానే అన్ని రాష్ట్రాలు చూస్తాయి.  అప్పుడు ఎమ్మెల్యే అలాగే ఎంపీ పోలింగ్లో ఎక్కువ శాతం జాతీయ పార్టీలకు ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది.
 
అప్పుడు ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రాంతీయ పార్టీలను నష్టపరిచేందుకే మోడీ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఇప్పటికే కొంతమంది అంటున్నారు. అంతేకాదు రాష్ట్రాల సమస్యలు పక్కకు జరిగి కేవలం జాతీయ సమస్యలు మాత్రమే తెరపైకి వస్తాయి. కేంద్రంలో అలాగే...  రాష్ట్రంలో జాతీయ పార్టీలే అధికారంలో ఉంటే... ఆయా రాష్ట్రాలకు కచ్చితంగా నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్   బిజెపి పార్టీ అధికారంలో ఉన్న కూడా పెద్దగడ్డ డెవలప్మెంట్ లేదు. తెలంగాణ కంటే కిందిస్థాయిలోనే ఉత్తరప్రదేశ్ ప్రతిసారి ఉంటుంది.

అయితే ఈ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు నష్టపోకుండా ఉండాలంటే... జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది. అలా పెట్టుకున్న కూడా జాతీయ పార్టీలదే హవా కొనసాగుతుంది. పొత్తులు కాకుండా మరొక మార్గం ఏంటంటే అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమై థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడాలి. అయితే మన దేశ చరిత్రలో థర్డ్ ఫ్రంట్  సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే ఎవరో ఒకరు గొడవలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ జమిలి ఎన్నికలు మాత్రం... ప్రాంతీయ పార్టీల మనుగడకే  ప్రమాదాన్ని తీసుకువచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: