కరుగుతోన్న అమెరికా డాలర్ డ్రీమ్స్ కల: చావుల మధ్యలో భారతీయుల చదువులు ?
* 2024 లో... రికార్డు స్థాయిలో వీసాల జారీ
* వీసా కేంద్రాల వద్ద క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు
అమెరికా అగ్రరాజ్యమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియా కంటే చాలా.. వేగంగా అభివృద్ధి చెందిన దేశం అమెరికా. అంతేకాదు మన దేశంతో పాటు చాలా దేశాల కంటే ముందంజలో ఉంది. ఆ దేశానికి అప్పులు ఉన్నా సరే.. అభివృద్ధిలో మాత్రం దూసుకు వెళ్తోంది అమెరికా. అలాంటి అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు.
మన ఇండియా నుంచి కూడా విద్యార్థులు... లక్షల్లో వెళ్తున్నారు. అక్కడే చదువుకొని అక్కడే ఉద్యోగాలు కూడా సంపాదించగలుగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియా విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది అమెరికా. గతంలో కంటే ఈసారి ఎక్కువగా విద్యార్థులకు వీసాలు ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఇందులో భాగంగా ఇండియా వ్యాప్తంగా ఎనిమిదో విద్యార్థి వీసా వార్షికోత్సవాన్ని నిర్వహించారు. దీంతో ఇండియాలోని అమెరికా ఎంబసీ కేంద్రాలు ఉన్న ఢిల్లీ చెన్నై హైదరాబాద్ కోల్కతా ముంబై లలో .. ఇంటర్వ్యూలకు అభ్యర్థులు వెళ్తున్నారు. దీంతో ఈ కేంద్రాల వద్ద.. అభ్యర్థులు భారీ క్యూ కట్టడం జరిగింది. 2023 సంవత్సరంలో 1,40,000 విద్యార్థి వీసాలను జారీ చేసింది అమెరికా. 2018 2019 2020 సంవత్సరాల కంటే ఎక్కువ స్థాయిలో 2023 లోనే ఎక్కువ శాతం... మీసాలు జారీ చేసింది అమెరికా. అయితే 2023 కంటే ఈ 2024లో మరిన్ని.. మీసాలు ఇచ్చేందుకు రెడీ అయింది అమెరికా.
అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకు వీసాలు కూడా జారీ చేసింది. అయితే వీసాలు జారీ చేసినప్పటికీ.. అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్థులు చాలా మంది మరణిస్తున్నారు. రకరకాల కారణాల తెలుగు విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ.. ఎంతో సాహసం చేసి తెలుగు విద్యార్థులు అక్కడికి వెళ్లి చదువుకుంటున్నారు. ఇక కొంత మంది చదువుల కోసం అమెరికా వెళ్లి..పెట్రోల్ బంకుల్లో కూడా పని చేస్తున్నారు. అష్ట కష్టాలు పడి...చదువుకునే ప్రయత్నం చేస్తున్నారు.