ట్రంప్ మళ్లీ గెలిస్తే...అంధకారంలోకి భారతీయులు ?

Veldandi Saikiran
* డెమోక్రటిక్ పార్టీ నుంచి బరిలో కమలా హరీష్‌
* ట్రంప్ గెలిస్తే..  ఇండియాకు నష్టమే
* కమల హారిస్ గెలవాలని ఇండియన్స్ పూజలు
* కమలా హరీష్‌ గెలిస్తే..ఇండియాకు లాభామా ?


అగ్రరాజ్యం అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రరాజ్యంలో.. చదువుకునేందుకు అలాగే.. ఉద్యోగం చేసేందుకు చాలామంది.. ఆసక్తి చూపిస్తారు. ఈ తరుణంలోనే మన ఇండియా నుంచి కూడా చాలామంది అమెరికా వెళ్లి సెటిల్ అవుతున్నారు. కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదివి అక్కడే సెటిల్ అవుతున్నారు. అయితే.. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.
 
నవంబర్ 5వ తేదీన ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రభావం.. మన ఇండియా పైన కచ్చితంగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎవరు ప్రెసిడెంట్గా గెలుస్తారో... వారు ఆ దేశాన్ని శాసిస్తారు. అయితే ఈసారి బరిలో... ట్రంప్ మరియు  కమల హారిస్ బరిలో ఉన్నారు. ట్రంప్ అమెరికాకు చెందిన వాడు. ఆయన పార్టీ రిపబ్లికన్ అన్న సంగతి తెలిసిందే.
 
ఇటు కమలా హరీష్ డెమోక్రటిక్ పార్టీ. ప్రెసిడెంట్ బరిలో ఉన్న కమలహారిష్ మన ఇండియాకు చెందిన వ్యక్తి. ఆమె ప్రెసిడెంట్గా విజయం సాధిస్తే... కచ్చితంగా మన ఇండియాకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది...ఇండియాకు ఇచ్చే వీసాల సంఖ్యను ఆమె పెంచే ఛాన్స్ ఉంటుంది.అలాగే మన ఇండియన్స్... అమెరికాలో... చాలా స్వేచ్ఛగా జీవించవచ్చు. అన్ని రంగాల్లో మనకు ప్రాధాన్యత... దక్కే ఛాన్స్ ఉంటుంది.
 
అదే సమయంలో ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే... కచ్చితంగా నియంత పాలన కొనసాగిస్తారు. ఆయన కేవలం.. ప్రాంతీయతత్వం  రగిల్చి గెలిచే ఛాన్స్ ఉంటుంది. విదేశీయులకు.. ఎక్కువ స్థాయిలో వీసా లు ఇచ్చేది లేదని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. స్థానికులకు ఉపాధి.. కల్పించేలా అమెరికన్లలో..  ఓ ఉద్యమాన్ని లేపుతున్నారు.  కాబట్టి ట్రంప్ గెలిస్తే ఇండియాకు కష్టాలు తప్పవని కొంతమంది చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: