రాయలసీమ: అందరి లెక్కలు తేలుస్తా అంటూ వైసిపి నేత మాస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే..?
కేతిరెడ్డి వాహనాన్ని కూటమి కార్యకర్తలు అడ్డుకోవడంతోపాటు ముందుకు కదలనివ్వకుండా కారణ చుట్టూ ముట్టారు. ఈ క్రమంలోనే కారు పైకి ఎక్కేందుకు కూటమి కార్యకర్త ప్రయత్నించడంతో కేతిరెడ్డి కారును వేగంగా ముందుకు నడిపి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటన పైన స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పైన పైరయ్యారు.. తనకు కూడా టైం వస్తుందని తానేంటో చూపిస్తానంటూ కూటమి నేతలను హెచ్చరించారు.. ప్రతి లెక్క సారానికి కూడా తాను ఒక లెక్కని సరి చేస్తానని కొత్త వాళ్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారని గొడవలు వద్దనుకొని తమ నాయకులను కార్యకర్తలను ఇప్పటివరకు సర్ది చెప్పుకుంటూ నే వచ్చాము..
ప్రభుత్వ హామీలను నెరవేర్చడానికి ఏడాది పాటు సమయం ఇద్దామనుకున్నాము కానీ గొడవలను ప్రోత్సహిస్తున్న సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి అంటే కేవలం పీఏల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడింది.. జమిలి ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కులడం ఖాయమని.. తనని అడ్డుకున్న వారి పైన కూడా చట్టపరంగా పోరాడుతానంటూ తెలియజేశారు. ఈ విషయం పైన ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ కూడా స్పందిస్తూ కేతిరెడ్డి తీరుపైన ఆయన మండిపడ్డారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడంతో ఆయన మైండ్ బ్లాక్ అయ్యిందని అందుకే ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయారంటూ కూడా ఫైర్ అయ్యారు.. ధర్మవరం ప్రజలకు చిన్న కీడు చేపట్టిన దహించని అంటూ తెలిపారు ఎమ్మెల్యే సత్యకుమార్.