కూట‌మి నెక్ట్స్ టార్గెట్ ఇదే... జ‌గ‌న్‌కు వాచిపోద్ది...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలాచోట్ల స్థానిక సంస్థలు చేతులు మారిపోయాయి. ఎన్నికలకు ముందు వరకు వైసీపీ చేతిలో ఉన్న స్థానిక సంస్థలు ఇప్పుడు కూటమి చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కూటమి నెక్స్ట్ టార్గెట్ విశాఖ జిల్లా పరిషత్ అంటున్నారు. విశాఖ జిల్లా పరిషత్ పూర్తి మెజార్టీతో వైసీపీ చేతుల్లో ఉంది. నూటికి 95 మంది సభ్యులు వైసీపీకి చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు జడ్పీ పీఠాన్ని తమ వైపు తిప్పుకోవడానికి కూటమి ప్ర‌భుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తం మీద టిడిపి కూటమికి చెందిన వారే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.

దీంతో వారందరూ అఫీషియల్ సభ్యులుగా కూడా ఉంటారు. ఇక కూటమి వైపు చూసేవారికి తాయిలాలతో ఆకర్షిస్తే చాలు.. విశాఖ జడ్పీ చైర్మన్ పదవి వచ్చి తమ ఖాతాలో పడుతుందని కూటమినేతలు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. వైసీపీకి అత్యధిక బలం జడ్పీలో ఉంది. అందులో ఏజెన్సీలో ఎక్కువగా ఉంది. అక్కడ వారంతా వైసీపీకి చెందిన వారే ఉన్నారు. వారితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరు వైసిపి వారే ఉన్నారు. జడ్పీ చైర్పర్సన్ సుభద్ర కూడా ఏజెన్సీకి చెందిన వారే. విశాఖ జడ్పీ పీఠాన్ని ఎస్టీకి కేటాయించారు. అలా సుభద్రకు ఈ పదవి వరించింది. ఆమె వైసీపీకి విధేయురాలుగా ఉన్నారు. ఏజెన్సీలో వైసిపిని కాదని వెళ్లిన వారికి రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తున్నారు అక్కడ ప్రజలు.

ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక జడ్పీ చైర్పర్సన్ సుభద్రకు ఇస్తున్న భద్రతను ఒక్కసారిగా తగ్గించేశారు. ఎలాగైనా ఒత్తిడి చేసి ఆమెను తమ వైపు తిప్పుకోవాలని కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి.. మారుమూలన ఉన్న మంచంగి పుట్టు మండలానికి చెందిన సుభద్ర కు నిబంధనల ప్రకారం భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. పైగా అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఏది ఏమైనా పలువురు జడ్పిటిసిలను తమ వైపునకు తిప్పుకొని విశాఖ జడ్పీ పీఠంపై కూటమి జెండా ఎగరవేయాలి అన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్న మాట వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: