జగన్‌ ను ఒంటరి చేస్తున్న రాహుల్‌, మోడీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ పైన వివాదం కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తి అయిందని.. స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఈ వివాదం రాజు కుంటోంది. దేశవ్యాప్తంగా ఈ వివాదం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు.. కల్తీ అయిందని చంద్రబాబు చెప్పడం జరిగింది.

జంతువుల కొవ్వుతో తిరుమల శ్రీవారి లడ్డును తయారు చేయించారని.. కల్తీ నెయ్యిలు వాడుతున్నారని చంద్రబాబు తెలిపారు. అయితే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని చంద్రబాబు చెప్పడంతో వివాదం.. తారా స్థాయికి చేరింది. అయితే ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ కూటమి పార్టీలు అలాగే... హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి.
 

దీనిపై ఎంత కౌంటర్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డిని అందరూ అంటున్నారు. అయితే.. ఈ విషయంలో మోడీ అలాగే రాహుల్ గాంధీ...  కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతలందరూ... లడ్డు వివాదం పై స్పందించారు.  గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరిగిందని కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఈ లడ్డుల అంశంపై కాంగ్రెస్ అలాగే బిజెపి.. ఓకే వాయిస్ ను రేజ్ చేస్తున్నాయి.

అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అన్ని పార్టీలు.. విమర్శలు చేస్తున్నాయన్నమాట. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతున్నాడని కొంతమంది చెబుతున్నారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇదే అంశంపై జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేక పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. దీనిపై కచ్చితంగా ఎంక్వయిరీ చేసి.. దోషులను బయటకు తీసుకువస్తామని.. అటు కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: