జగన్‌ కు కొత్త చిక్కులు...వైసీపీ పాలనలో 300 ఆలయాలు ?

Veldandi Saikiran

ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి కొత్త చిక్కులు వస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తున్న కూటమి సర్కార్‌... ఇప్పుడు దేవాలయాలపైన పడింది. ఇందులో భాగంగానే..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. 11 రోజుల పాటు దీక్షకు దిగారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా జగన్‌ ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు.

ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ది కోసమో నేను ఈ దీక్ష చేపట్టడం లేదని వివరించారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపనలు చేశారు. వైసీపీ పాలనలో 300 ఆలయాలను అపవిత్రం చేశారని బాంబ్‌ పేల్చారు. ప్రసాదాల్లో కల్తీ జరుగుతోంది.. నాణ్యత లేదని ముందు నుంచీ చెబుతున్నాని గుర్తు చేశారు పవన్‌.

టీటీడీపై వైట్ పేపరు రావాలని కోరుకున్నామని... ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని అనుకోలేదని వెల్లడించారు. దారుణం ఏంటంటే అయోధ్యకి లక్ష లడ్డూలు పంపించారని కూడా ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఆగ్రహించారు. రాజకీయ లబ్ది కోసం చేస్తున్నామని వైసీపీ అంటోందని.. రామతీర్థం దేవుడి విగ్రహం ధ్వంసం చేసినప్పుడే రోడ్డు మీదకు వచ్చేవాడిని అని తెలిపారు. ఆ రోజు రాజకీయం చేయలేదని గుర్తు చేశారు. దాడులు జరుగుతున్నప్పుడు చూస్తు కూర్చుకోడం కూడా తప్పేనన్నారు.

ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదని హెచ్చరించారు. పగ ప్రతీకారం తీర్చుకునే ప్రభుత్వం కాదని వివరించారు. తప్పులు చేయడం అలవాటు అయిందని మండిపడ్డారు. దీనికి పుల్ స్టాప్ పెట్టాలని కోరారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.  వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఉన్న బోర్డు ఏం చేసింది..? తప్పులు చేసిన వారిని వెనకేసుకురావద్దని పేర్కొన్నారు ఏపీ మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. చర్చి, మసీదులో ఇలా జరిగితే ప్రపంచం అంతా గొడవ చేస్తారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: