రథం చుట్టూ రాజకీయం: 62 ఏళ్ల చరిత్ర గల రథం అగ్నికి ఆహుతి.. ప్రమాదమా.. కుట్రా..?
- ప్రకృతి వైపరీత్యాలనుంచి కాపాడే దేవుడు..
- స్వామి వారి రథచక్రం అగ్నికి ఆహుతి..
మన భారతదేశం అంటేనే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. అలాంటి ఈ దేశంలో ప్రజలందరికీ భక్తిరస భావం ఎక్కువగా ఉంటుంది. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆ దేవుని వైపు చూసుకొని మొక్కుతూ ఉంటారు. ఆ విధంగా భక్తులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఒకరు. అలాంటి ఈ స్వామి అంతర్వేదిలో ఎంతో ఫేమస్. ఇక్కడి దేవాలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా ఇట్టే నెరవేరుతాయని ఒక నమ్మకం. అలాంటి స్వామివారికి ప్రతి ఏటా పూజలు జరుగుతూనే ఉంటాయి. స్వామివారిని వ్రతంలో ఊరేగిస్తారు. అలాంటి అంతర్వేదిలో ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి 62 ఏళ్ల రథం కొన్ని సంవత్సరాల క్రింద అగ్నికి ఆహుతి అయింది. రథం ఎలా కాలింది...దీని వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
అంతర్వేది రథం అగ్నికి ఆహుతి :
తూర్పుగోదావరి జిల్లాలో ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ రథానికి 62 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ప్రతి ఏటా వారం రోజులపాటు స్వామివారి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలోనే ఈ రథంలో స్వామివారిని ఊరేగిస్తారు. ఆ తర్వాత సముద్రంలో స్వామివారికి పుణ్యస్నానాలు చేయిస్తారు. ఇక ఊరేగింపు అయిన తర్వాత ఈ రథాన్ని అక్కడే ఉండే ఒక షెడ్డులో భద్రపరుస్తారు. అలాంటి ఈ రథం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరైనా కావాలనే చేశారా అనేది మాత్రం తెలియదు. దీనిపై సిబిఐ ఎంక్వయిరీ వేసి విచారణ చేపట్టారు. కానీ ఇంతవరకు ఆ విషయం మాత్రం బయట పెట్టలేదు.
ఈ విధంగా అంతర్వేదిలో రథం కాలిపోవడంతో అక్కడి ప్రజలు భయంతో వణికి పోయారు. ప్రకృతి వైపరీత్యాలనుంచి కాపాడే స్వామి రథమే కాలిపోతే మనకు ఎలాంటి వైపరీత్యాలు చోటు చేసుకోబోతున్నాయోనని ప్రజలు విపరీతంగా భయపడిపోయి స్వామివారికి నిష్ఠతో పూజలు చేశారట. అయితే రథాన్ని ఎవరైనా కావాలనే కాల్చారా లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందా అనేది మాత్రం బయటకు రాలేదు. నిజానికి స్వామివారిని ఊరేగించే సమయంలో రథంలో తేనెతో హోమాలు నిర్వహిస్తారు. ఈ తేనె రథంపై పడడం షార్ట్ సర్క్యూట్ తో ఈజీగా మంటలు ఎగిసి పడ్డాయని కొంతమంది భావించారు. ఏది ఏమైనప్పటికీ అంతర్వేదిలో రథం కాలిపోవడంపై అప్పట్లో తీవ్రదుమారం చెలరేగింది అని చెప్పవచ్చు.