ఏపీ: వైద్యుడు పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. ఇబ్బందులు తప్పవా..?

Divya
కూటమిలో భాగంగా జనసేన, టిడిపి ,బిజెపి నేతలు బారి స్థాయిలో గెలవడం జరిగింది.. అంతేకాకుండా వైసిపి నుంచి కూడా చాలామంది నేతలు అటు జనసేన పార్టీ వైపుగా మగ్గుచూపుతున్నారు. ఇలాంటి సమయంలోనే తాజాగా దళిత వైద్యుడు పైన జనసేన ఎమ్మెల్యే దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తిగా చూద్దాం.

కాకినాడ రంగరామ వైద్య కళాశాల ఉన్నది.. కాకినాడ ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులతో సైతం అక్కడికి వెళ్లి కాలేజీ  హెచ్ఓడి ఉమామహేశ్వరరావు పైన దాడి చేసి చంపేస్తానంటూ బెదిరించారట.. అలాగే పలు దుర్భాషలు మాట్లాడినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే నోటికొచ్చినట్లు బండబూతులు తిడుతూ దళిత ప్రభుత్వ వైద్యుడు పైన పంతం నానాజీ తన అనుచరులతో దాడికి దిగారట. కాకినాడ రంగరామ వైద్య కళాశాలకు సుమారుగా శ్రీనగర్లో 12 ఎకరాల ఆట స్థలం ఉన్నదట. ఇందులో 150 గజాలలో మెడికల్ పిల్లల కోసం వాలీబాల్ కోర్టు ఉన్నదట.

అయితే వైద్య కళాశాల అనుమతి లేకుండా ఇతరులు లోపలికి ప్రవేశించకూడదు. గడచిన కొన్ని నెలలుగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ యొక్క అనుచరులు సుమారుగా 40 మంది యువకులు ఈ వాలీబాల్ కోర్టుకు ప్రతిరోజు వస్తూ మెడికల్ విద్యార్థులపై గొడవలకు దిగేవారట. అలాగే వాకింగ్ చేస్తున్న మహిళల పైన కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండే వారిని.. ఈ విషయాలను అక్కడి మెడికోలు . విద్యార్థులు  హెచ్ఓడి  ఉమామహేశ్వరరావుకు ఫిర్యాదు చేశారట. ఈ విషయాన్ని వైద్య కళాశాల యాజమాన్యనీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందట.

ఇలాంటి సమయంలోనే తన అనుచరులతో ఆర్ఎంసి ప్రిన్సిపాల్ నరసింహని ఇటీవలే ఎమ్మెల్యేలు ఫోన్లో అడగగా అందుకు నరసింహ కూడా ఈ విషయం పైన అభ్యంతరాన్ని తెలియజేశారట. అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచరులు కోర్టులో వాలీబాల్ ఆడుతూ ఉండడం తెలుసుకున్న కాలేజ్ అధికారులు గ్రౌండ్ కు చేరుకొని అక్కడినుంచి వెళ్లిపోవాలి అంటూ ఎమ్మెల్యే అనుచరులకు నచ్చచెప్పిన.. వినకపోవడమే కాకుండా ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులతో గ్రౌండ్ కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరి పైన గొడవకు దిగారట .దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరి ఈ విషయం ఎంతవరకు వెళుతుందో చూడాలి..పార్టీ అధినేతలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: