కేసీఆర్‌ను మించిన అస‌లు సిస‌లు తెలంగాణ వాది రేవంత్‌... ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా..?

RAMAKRISHNA S.S.
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత.. కేసిఆర్ తెలంగాణ వాదిగా బాగా హైలైట్ అయ్యారు. 10 ఏళ్లపాటు తెలంగాణకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్‌ను గద్దెదింపి.. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను మించిన తెలంగాణ యోధుడిగా.. తెలంగాణ వాదిగా.. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. సాధారణంగా కమ్యూనిస్టులకు.. కాంగ్రెస్ పార్టీకి పడదు. సిద్ధాంతపరంగా రెండు పార్టీలకు వైరుధ్యం ఉంది. అయితే బిజెపి మీద పోరాడటానికి మాత్రం ఇద్దరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. తెలంగాణలో ఒకప్పుడు కమ్యూనిస్టుల హ‌వా ఎక్కువగా ఉండేది. అయితే చివరకు ఈ రెండు పార్టీలు ఒక ఎమ్మెల్యే సీటు గెలిచేందుకు కూడా.. కష్టపడే పరిస్థితి వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ.. కాంగ్రెస్‌ మిత్రపక్షంగా ఉండి కొత్తగూడెం సీటు గెలిచింది. సిపిఎంకు అసలు అసెంబ్లీలో ప్రాథమిథ్యం లేకుండా పోయింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక.. కమ్యూనిస్టులను కూడా కలుపుకుని వెళుతూ కేసీఆర్‌ను మించిన తెలంగాణ వాదిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సరిగా గౌరవించలేదన్న విమర్శలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే గద్దర్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఎన్నికలలో కూడా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గద్దర్ కుమార్తె వెన్నెలకు సీటు ఇచ్చారు.

గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన పేరును శాశ్వతం చేశారు. హైదరాబాదులోని కోటి ఉమెన్స్ కళాశాలను కెసిఆర్ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు దానికి తెలంగాణ సాయుధ పోరాటయోదురాలు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించారు. చిట్యాల ఐలమ్మ పేరు చాకలి ఐలమ్మ గా బాగా పాపులర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఐలమ్మ పేరును హైలెట్ చేస్తున్నారు. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఆ పని చేయలేదు.

ఇప్పుడు ఆ యూనివర్సిటీకి సుర‌వరం ప్రతాపరెడ్డి పేరు పెడతానని రేవంత్ చెప్పారు. ఆయన ప్రసిద్ధ గోల్కొండ పత్రికకు సంపాదకుడు. గొప్ప రచయిత కూడా. తెలుగు యూనివర్సిటీ ఆయన పేరు పెట్టడం బాగా న్యాయం జరిగినట్టు అవుతుంది. ఏది ఏమైనా రేవంత్.. కెసిఆర్‌ను మించిన తెలంగాణ వాదిగా దూసుకుపోతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: