వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి జనాలకు పరిచయం అక్కర్లేదు. దువ్వాడ ఒక వైసీపీ ఎమ్మెల్సీగా కంటే కూడా, ఒక ప్రేమికుడిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు. కొద్ది రోజుల క్రితం దువ్వాడ సతీమని వాణి, ఆమె కుమార్తెలు కలిసి ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పు బాదుతూ రచ్చకెక్కిన సంగతి విదితమే. దీంతో దువ్వాడ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం, ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం కాస్త మీడియాలోకి ఎక్కిన విషయం విదితమే. దువ్వాడ ఇద్దరు కుమార్తెలు హైందవి, నవీన ఆయన ఇంటికి వెళ్లి తనని చూసి వెళ్లిపోతామని చెప్పినా తలుపులు తీయక పోవడంతో అర్దరాత్రి గంటల వరకు ఇంటి బయటే ఉండిపోయి నిరసనలు తెలియజేసిన సంగతి ఆంధ్ర మొత్తం తెలిసిందే.
ఈ క్రమంలోనే వేరొక మహిళ ట్రాప్ లో తమ భర్త ఉండటంతోనే ఈ పరిస్దితి వారికి వచ్చిందని దువ్వాడ భార్య వాణి , కుమార్తెలు హైందవి, నవీన మీడియా ముందు వాపోయారు. అయితే, దువ్వాడ కుటుంబంలో చాలా కాలంగా ఈ వివాదం నడుస్తున్నప్పటికీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఈ విషయం గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఎన్నికల టైంలో భర్త పైనే పోటీ చేసేందుకు దువ్వాడ భార్య సిద్ధమయ్యారుకూడా. అప్పుడు వైసీపీ పెద్దలు తమ్మినేని సీతారం, వైవీ సుబ్బారెడ్డి, సీదిరి అప్పలరాజు అందర్నీ కూర్చోబెట్టి... పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ వాణికి ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీ ఇచ్చారు కూడా. కానీ ఇష్యు సద్దుమణగలేదు. ఇంకా కొనసాగుతోంది.
అసలు విషయం ఏమిటంటే ఆ గొడవకి కారణమైన మహిళ మాధురి నిర్మాణ సారధ్యంలో దువ్వాడ దర్శకత్వ బాధ్యలు నిర్వహించి, హీరోగా నటించి తీసిన "వాలంటీర్" సినిమా, 'మాధురి మీ తెలుగు అమ్మాయి' యూట్యూబ్ ద్వారా స్వయంగా మాధురి కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేయడం జరిగింది. గడిచిన ఎన్నికలు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సామాజిక ఇతివృత్తాంతంతో తెరకెక్కింది. ఈ సినిమాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. సమాజంలో వాలంటరీ పాత్ర ఎంత ముఖ్యమో అన్న ప్రధానాంశాన్ని తీసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. కాగా ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది... దువ్వాడ-మాధురి వ్యవహారం రాష్ట్రంలో గుప్పుమనడంతో ఆ సమస్య ఇపుడు ఈ సినిమాపై పడుతోంది. చూసిన వాళ్ళు సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.