తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి.. వెను వెంటనే షెడ్యూల్ ప్రకటించటంతో పాటు పరీక్షలను కూడా పూర్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది.ఈ నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్లైన్ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కీ పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఆగస్టు 20వ తేదీగా నిర్ణయించింది. జులై 18న ప్రారంభమై డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలు ఆగస్టు 5 తేదీతో ముగిశాయి. డీఎస్సీకి మొత్తం 2,79,957 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 2,45,263 మంది అంటే 87.61 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది పరీక్షలకు దూరంగా ఉన్నారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 92.10 శాతం హాజరు నమోదైంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ ఆన్సర్ కీ తయారు చేసి, ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ కార్యచరణ రూపొందించింది. ఈ మేరకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరుకు తుది ఆన్సర్ కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపద్యంలో డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు ఈనెల 6న రిలీజ్ చేయగా జనరల్ ల్యాంకింగ్ లిస్టు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. డీఎస్సీ మార్కులకు టెట్ స్కోరును కలిపి వారంలో లిస్టు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ సమాచారం లేదు.జాబితా విడుదలకు మరింత ఆలస్యం కానుండడంతో అభ్యర్థుల ఆందోళనలో చెందుతున్నారు. జి ఆర్ ఎల్ ఇచ్చాక జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి మెరిట్ జాబితాను డీఈవో లకు పంపాల్సి ఉంటుంది.ఇదిలావుండగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఇందులో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందే.. నవంబరులో మరోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. జనవరిలో పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది.