తిరుమల లడ్డులో బీఫ్ కొవ్వు...వైసీపీ పాపం పండినట్లేనా..పక్కా ఆధారాలు ఇవే?
* కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన
* జగన్ పాలనలో తిరుమల కొండ అపవిత్రమైందని ప్రచారం
* తిరుమల కొండ పైన క్రైస్తవ ఉద్యోగులే ఎక్కువ
* ప్రమానాలకు సిద్ధమైన వైసీపీ నేతలు
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుమల లడ్డు ప్రసాదం పైన వివాదం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో... తిరుమల పుణ్యక్షేత్రం అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆరోపించారు. అంతేకాదు తిరుమల లడ్డు ప్రసాదంలో.. నెయ్యి వాడాల్సింది.. జంతువుల కొవ్వు వాడారని...సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా... తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి సర్కార్.. చేయలేదని కూడా ఆయన మండిపడ్డారు.
అయితే చంద్రబాబు చేసిన కామెంట్లకు అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో.. టిటిడి చైర్మన్ లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన ఈ అంశం పైన క్లారిటీ ఇచ్చారు. తాము ఎలాంటి జంతువుల కొవ్వు వాడలేదని... చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ మేము జంతువుల కొవ్వును లడ్డు ప్రసాదంలో కలిపితే... తమకు శ్రీవారు శిక్ష వేస్తారని కూడా వైసిపి నేతలు చెబుతున్నారు.
అయితే వైసిపి నేతలు కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో.. ఏపీ మంత్రులు అలాగే టిడిపి నేతలు కూడా... రివర్స్ అటాక్ చేస్తున్నారు. సోషల్ మీడియా స్టార్, టిడిపి పార్టీ నేత ఆనం కూడా దీనిపై సెటైరికల్ పోస్ట్ పెట్టారు. తిరుమల లడ్డులో నిజంగానే జంతువుల కొవ్వు కలిపారని.. ఓ సంస్థ ఇచ్చిన నివేదికను టిడిపి నేత ఆనం బయటపెట్టారు. ఇంత పచ్చిగా రిపోర్టులు వచ్చినా కూడా వైసిపి నేతలు ప్రమాణాలు చేయడం దారుణం అన్నారు.
అయితే తిరుమల ప్రసాదంలో... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా చేసిందని.. చెప్పడం దారుణమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రసాదంలో చిన్న చిన్న అవకతవకలు జరిగ వచ్చును... ఇంత పెద్ద స్థాయిలో... కుంభకోణం జరగలేదనిరాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా చేసి ఉంటే కచ్చితంగా తిరుమల శ్రీవారు శిక్షిస్తారని తెలుపుతున్నారు.