ఏపీ: పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.!
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే.. అప్పుడు పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. అలాగే 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది. ఒకవేళ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్‌ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది.ఇదిలావుండగా ఏపీలో మార్చి నెల వరకూ వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సూచనలతో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో వేయాలని, బ్యాంకు అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో పింఛన్ దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.