చంద్రబాబుకు మోడీ వెన్నుపోటు...కూటమి సర్కార్ కూలడగ గ్యారెంటీ ?
ఎలాగైనా ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలన్నది మోడీ లక్ష్యం. అయితే ఇప్పటివరకు ఆ దిశగా మోడీ సర్కార్ ఎక్కడ చర్యలు తీసుకోలేదు. కానీ మళ్ళీ జమిలి ఎన్నికల పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఈసారి సరైన మెజారిటీ రాలేదు. నితీష్ కుమార్ అలాగే చంద్రబాబు నాయుడు సహాయంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అంటే మిత్రపక్షాలు సైడ్ అయిపోతే మోడీ ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ.
ఇలాంటి నేపథ్యంలో మోడీ మధ్యంతర ఎన్నికలకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధం చేశారట. మధ్యంతర ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా... మోడీ ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల... మోడీ ప్రభావం అన్ని రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితులు దేశ ప్రజలు లేరు.
అంటే ఓటర్లందరూ బిజెపి వైపు మొగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే మోడీ ప్రభుత్వం మభ్యంతర ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 2026 వరకు ఈ ప్రక్రియ జరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జంబి ఎన్నికలు నిర్వహిస్తే... చంద్రబాబు కూటమికి బిజెపి గుడ్ బాయ్ చెప్పే ఛాన్స్ ఉందట. ప్రాంతీయ పార్టీలు ఇలాగూ నష్టపోతాయి కాబట్టి సొంతంగా ఏపీలో ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందట. అందుకే చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వార్తలు వస్తున్నాయి.