లాజిక్ మిస్ అయ్యారు మంత్రి సత్యకుమార్ సారు..!
ఇతర విషయాలు పక్కన పెడితే.. ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్.. చేసిన వ్యాఖ్యలు.. ఆయన పరిణితి ఎంతన్నదానిని నిరూపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో నానా తిప్పులు పడి.. కేంద్రం నుంచి జిల్లాకొక మెడికల్ కాలేజీని తీసుకువచ్చిన మాట వాస్తవం. ఈ విషయంలో సత్యకుమార్‌కు డౌటుంటే.. కేంద్రంలోని తమ ప్రభుత్వ పెద్దలను అడిగినా చెబుతారు. అనేక పరిశీలనలు.. చర్చల తర్వాత.. తెలంగాణకు కూడా ఇవ్వనన్ని మెడికల్ కాలేజీలను కేంద్రం ఇచ్చింది.
చిత్రం ఏంటంటే.. మేం అడిగితే మెడికల్ కాలేజీలు ఇవ్వడం లేదు... జగన్ అడిగితే ఇచ్చేస్తున్నారంటూ.. అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకే కాదు.. తమిళనాడుకూడా ఇవ్వలేదు. అలాంటిది జగన్ సాధించారు. దీనిని కూడా సత్యకుమార్ రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను తరిమేస్తున్నారు. పులివెందుల సహా.. పలు జిల్లాలకు శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలు అవసరం లేదంటూ.. ఎన్ ఎంసీకి ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో అవి పోతాయి.
అయితే.. ఇలా పోవడానికి కారణాలు చెబుతూ.. ఫ్యాకల్టీ లేకుండా... జగన్ కాలేజీలు తెచ్చుకున్నారని.. ఆయనకు దూర దృష్టి లేదని అందుకే వాటిని వదిలించుకుంటున్నామని సత్యకుమార్ పలుకుతున్నారు. బుర్రా బుద్ధి ఉన్న వాడు ఎవడైనా.. ముందు కాలేజీలకు అనుమతి తెచ్చుకున్న తర్వాతే.. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కోసం వెతుక్కుంటాడ న్న మినిమం నాలెడ్జ్ సత్యకుమార్‌కు లేదనుకోవాలా? అనేది సందేహం. అనుమతులు వచ్చేసరికి ఎన్నికల వ్యవహారం వచ్చేసింది. దీంతో ఫ్యాకల్టీ కోసం ఉద్దేశించిన రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది.
దీనిని ఇప్పుడు చేపట్టవచ్చుకదా? కాదనేవారు ఎవరు ఉంటారు? ఫ్యాకల్టీని తీసుకుని.. కాలేజీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చు కదా? కానీ, ఆ పనిచేయడం మానేసి.. కేంద్రం ఇచ్చిన అనుమతులు వద్దంటూ వెనక్కి పంపేస్తున్నారు. ఇలా చేస్తే.. భవిష్యత్తులో కేంద్రం మళ్లీ మెడికల్ కాలేజీలు ఇస్తుందా? అంటే.. ఎట్టి పరిస్థితిలో ఇవ్వదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో గత రెండేళ్ల కిందటే అనుమతులు వచ్చాయి. జగన్‌పై కోపంతో ఇప్పుడు వాటిని కాలదన్నుకుంటే.. రేపు సత్యకుమార్ కాదు.. నష్టపోయేది రాష్ట్రం అన్న విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకొవాలి.