ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీషి మర్లేనా?
అంతకు ముందే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే విషయం పైన ప్రకటన చేశారు. తాను రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తానని ప్రకటించి ఇవాళ రాజీనామా చేశారు అరవింద్ కేజ్రీవాల్. తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం శాసనసభ సభ్యులతో కీలక మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలందరూ అతిషీ మర్లేనాను ఎన్నుకున్నారు.
దీంతో అతిశీ... శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇక రేపు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా ఆమె బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి సునీత అలాగే అతి శీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి... అతిషీ ని ఎన్నుకున్నారు. ఇక దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక ఇవాళ సాయంత్రం పూట.. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలవబోతున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించుతారు. ఆ తర్వాత మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న అరవింద్ కేజ్రీవాల్... తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో... ఇప్పుడు దేశవ్యాప్తంగా ఢిల్లీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. హర్యానా ఎన్నికల్లో బరిలో ఉండేందుకు.. కేజ్రీవాల్ ఇలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అంటున్నారు