ఆ ఒక్క తప్పు చేయకపోతే.. రాజకీయ జీవితం మరోలా ఉండేది?

frame ఆ ఒక్క తప్పు చేయకపోతే.. రాజకీయ జీవితం మరోలా ఉండేది?

praveen

* బిఆర్ఎస్ లోనే ఉండుంటే ఉన్నత పదవులు వచ్చేవి
* పార్టీలు మారుతూ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్న విజయశాంతి
( తెలంగాణ- ఇండియా హెరాల్డ్ )

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో దగ్గర సంబంధం ఉంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఇండస్ట్రీలో స్టార్లుగా రాణించినవారు. ఇక తమ కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్త పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగు పెడితే.. ఇంకొంతమంది ఇక అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న పార్టీలో చేరి రాజకీయ ప్రస్తానాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఇలా సినిమాల్లో సక్సెస్ అయినట్లుగానే రాజకీయాల్లోనూ కొంతమంది సక్సెస్ అయితే.. ఇంకొంతమంది మాత్రం చివరికి కొన్నాళ్లపాటు తెరమీద కనిపించిన తర్వాత మాత్రం కనుమరుగైపోతూ ఉంటారు.

 అయితే ఇలా తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక వెలుగు వెలిగి.. ఇక ఇప్పుడు కనిపించకుండా పోయిన సిని నటుల్లో విజయశాంతి ఒకరు అని చెప్పాలి. ఆమె 180 పైగా సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. అయితే 1998లో ప్రజాసేవ చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట బిజెపి పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక అంతలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో 2005లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు విజయశాంతి. ఇక తర్వాత 2009లో తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టిఆర్ఎస్ లో చేరారు.

 అంతేకాదు ఫైర్ బ్రాండ్ గా గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఇక 2009లో టిఆర్ఎస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా ఒక్కసారిగా ఆమె రాజకీయ జీవితం మారిపోయింది. కానీ ఆ తర్వాత విజయశాంతి చేసిన ఒక్క తప్పిదం ఆమె రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసేసింది. ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న విజయశాంతి తెలుగు రాజకీయాల్లో ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి హవా నడిపిస్తుందని అందరూ అనుకుంటుండగా.. ఇక 2013లో టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనడంతో చివరికి పార్టీ నుండి సస్పెండ్ అయింది. ఇక ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఉన్న అన్ని పార్టీలు తిరుగుతూ వచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ, 2020లో బిజెపి పార్టీలో చేరింది. 2023లో కాషాయ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్లో కూడా ఇక ఇప్పుడు ఎక్కడ తెరమీద కనిపించట్లేదు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారాన్ని చేపట్టింది. ఒకవేళ విజయశాంతి ఆ పార్టీలో ఉండి ఉంటే మాత్రం.. ఆమె ఉన్నత పదవి చేపట్టేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చేజేతులారా ఒక్క తప్పిదంతో రాజకీయ జీవితాన్ని తలకిందులు చేసుకుంది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: