పదవి కోసం మారణ హోమం.. చెన్నారెడ్డిని పతనం చేసింది తోటి నేతలేనా.?
- ఆయనను తట్టుకోలేక వెనుక నుంచి వెన్నుపోటు..
- సొంత పార్టీ నేతలే గద్దె దించారా.?
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలను పాలించిన సీఎంల పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది అలనాటి ఎన్టీఆర్ తర్వాత చాలామందికి సుపరిచితుడు మర్రి చెన్నారెడ్డి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేసిన ఘనత చెన్నారెడ్డిది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో పథకాలు, పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు, చేశారు. అలాంటి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సేనానిగా గొప్ప పరిపాలన దక్షకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాంటి చెన్నారెడ్డి రాజకీయ జీవితంలో సొంత పార్టీ నేతల వల్లే పతనమైపోయారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజకీయ పతనం:
1978, 1989లో కాంగ్రెస్ పార్టీని ఏకధాటిగా అధికారంలోకి తీసుకువచ్చిన చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పదవులతో పాటు ఎన్నో వివాదాలు వెన్నంటే ఉండేవి. ఆ టైంలోనే ట్రబుల్ షూటర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఉన్న ఆయన రెండు సార్లు సీఎంగా, పనిచేసి నెహ్రూ, ఇందిరా గాంధీలకు ఎంతో ఆప్తుడిగా మారారు. అంతేకాకుండా నాలుగు కీలకమైన రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా సేవలందించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నిత్య తిరుగుబాటు దారుడిగా పేరు తెచ్చుకున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఒకానొక సమయంలో ప్రజా ఫ్రంట్ పేరుతో పార్టీ కూడా స్థాపించారు. ఈ విధంగా తొలి తరం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలుగించాడు మర్రి చెన్నారెడ్డి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు దృష్ట్యా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1971లో ఆరు సూత్రాలు అమలు కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఇంతటి ఘనత సాధించిన చెన్నారెడ్డిని సొంత పార్టీ నేతలే పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేలా చేశారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయట.