ఏపీ: కొత్త పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.!

FARMANULLA SHAIK
రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొత్త పెన్ష‌న్ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. పెన్ష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వృద్ధ‌ాప్య, వితంతు, ఒంట‌రి మ‌హిళ‌, ట్రాన్స్‌జెండ‌ర్‌, గీత కార్మికులు, మ‌త్స్య‌కారు పెన్ష‌న్ నెల‌కు రూ.3,000 నుండి రూ.4,000ల‌కు పెరిగింది.దివ్యాంగు పెన్ష‌న్ నెల‌కు రూ.6,000ల‌కు, పూర్తిస్థాయి దివ్యాంగుల‌కు రూ.5,000 నుండి రూ.15,000కు, తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డేవారికి రూ.5,000 నుండి రూ.10,000ల‌కు పెంచారు.
ఇదిలావుండగా రాష్ట్రంలో ఏడాది కొత్త పెన్ష‌న్లు మంజూరు నిలిచిపోయింది. దీంతో సుమారు మూడు ల‌క్ష‌ల మంది పెన్ష‌న్ కోసం నిరీక్షిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో న‌వ‌శ‌కం ప‌థ‌కంలో భాగంగా ఏటా జ‌న‌వ‌రి, జులై నెల‌ల్లో కొత్త పెన్ష‌న్లు మంజూరు చేస్తూ వ‌చ్చింది. 2023 జ‌న‌వ‌రికి ముందు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి జులైలో అనుమ‌తి మంజూరు చేసింది. అయితే 2023 జులై, 2024 జ‌న‌వ‌రిలో పెన్ష‌న్‌లు మంజూరు చేయ‌కుండా ద‌ర‌ఖాస్తుల‌న్నింటినీ పెండింగ్‌లో పెట్టింది.జూన్ 4న రాష్ట్రంలో టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. టీడీపీ కూట‌మి కూడా జులైలో కొత్త పెన్ష‌న్‌ల‌కు ఆమోదించ‌లేదు. ప్ర‌స్తుతం దాదాపు మూడు ల‌క్ష‌ల కొత్త పెన్ష‌న్ల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చి మూడు నెల‌లు కావ‌స్తున్న‌ప్ప‌టికీ, కొత్తగా పెన్ష‌న్‌కు ద‌ర‌ఖాస్తుల‌ను కూడా స్వీక‌రించ‌లేదు. దివ్యాంగు, వృద్ధ‌ప్య‌, వితంతు, ఒంట‌రి మ‌హిళ‌లు కూడా పెన్ష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరుతున్నారు.
రాష్ట్రంలో ప్ర‌స్తుతం 64 లక్షల పైచిలుకు పెన్ష‌న్లు ఉన్నాయి. వాటి కోసం ప్ర‌భుత్వం ప్ర‌తి నెల రూ.రెండు వేల ఏడు వందలు కోట్లు ఖ‌ర్చు చేస్తుంది. ఇప్పుడు కొత్త పెన్ష‌న్ల అప్లికేష‌న్ల‌ను ఆమోదిస్తే కొత్త‌గా సుమారు మూడు ల‌క్ష‌ల పెన్ష‌న్లు పెరుగుతాయి. అంటే దాదాపు 67 ల‌క్ష‌ల పెన్ష‌న్లు అవుతాయి. ఇటీవ‌లి ఒక స‌మావేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు కొత్త పెన్ష‌న్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే.అక్టోబ‌ర్ నుంచి కొత్త పెన్ష‌న్లు అందిస్తామ‌ని వెల్ల‌డించారు. అర్హులు కొత్త‌గా పెన్ష‌న్ ఎవ‌రైనా పొందాల‌నుకునేవారు సెప్టెంబ‌ర్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని  సూచించారు. దీంతో కొత్త పెన్ష‌న్ల‌కు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వంలో పింఛన్లు రద్దైన వారి నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి వాస్తవాలు గుర్తించింది. దరఖాస్తులు స్వీకరించిన 60 రోజుల్లోగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ నేపథ్యంలో అనర్హులకు పెన్షన్ అందుతుందో వారిని గుర్తించి వారి పింఛన్లను రద్దు చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో దాదాపు ఓ రెండు నుంచి మూడు లక్షల మంది పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: