సీతారాం ఏచూరి: ఇందిరమ్మ రాజీనామా కోసం పట్టుబట్టిన కమ్యూనిస్ట్ నేత.!

frame సీతారాం ఏచూరి: ఇందిరమ్మ రాజీనామా కోసం పట్టుబట్టిన కమ్యూనిస్ట్ నేత.!

FARMANULLA SHAIK
కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరి గురువారం నాడు అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఏచూరి గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆయన కామ్రేడ్‌ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఢిల్లీలోని ఏకే గోపాలన్‌ భవన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం కామ్రేడ్ సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు తరలించి ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధనల కోసం పార్థీవ దేహాన్ని దానంగా ఇవ్వనున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ కార్యాలయం ఒక ప్రకటలో తెలిపింది.ఇదిలా ఉండగా వామపక్ష పార్టీల నేతలు మరణం తర్వాత పార్థీవ దేహాన్ని ఆసుపత్రులకు దానంగా ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాల్లో ఒకటైన ఐరన్ లేడీగా పేరు పొందిన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గూర్చి ఒక వార్త వైరల్ అవుతుంది. ఆమె దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎమర్జెన్సీ విధించి దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులను అందర్నీ తీసుకెళ్లి జైళ్లలో నిర్భందించారు. అయితే అలాంటి ఇందిరాంధీ ముందు నిలబడి.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి. ఆయన మరణం వేళ గతంలో ఈ ఘటనకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆ సంఘటనకు సంబంధించిన విషయాలను నెటిజన్లు సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. ఇంతకీ ఆ సంఘటన ఎప్పుడు జరిగింది. ఇందిరాగాంధీని రాజీనామా చేయాలని సీతారాం ఏచూరి ఎందుకు డిమాండ్ చేశారు అనే విషయాలు తీసుకుంది.
విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో సీతారాం ఏచూరి చూపించిన తెగువ, పోరాట పటిమను కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీతో ఏచూరి ఉన్న ఫొటో వెనుక ఉన్న ఉద్దేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ జేఎన్‌యూకి ఇందిరాగాంధీ వైస్ ఛాన్సలర్‌గా ఉండేవారు. 1977లో జేఎన్‌యూలో ఏచూరి విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. అదే సమయంలో ఏచూరి పెద్ద ఎత్తున విద్యార్థులను వెంట వేసుకుని ఇందిరాగాంధీ ఇంటిని ముట్టడించారు. విద్యార్థుల ఆందోళన చూసి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. విద్యార్థులతో మాట్లాడుతుండగా డిమాండ్లు చెప్పాలని ఇందిర అడిగారు. ఆమె పక్కనే ఉన్న ఏచూరి ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఇందిరాగాంధీ పవర్ ఫుల్ లేడీగా, ఐరన్‌ లేడీగా గుర్తింపు పొందారు. అలాంటిది ఆమె పక్కనే నిలబడి ఆమె రాజీనామాను కోరడం.. విద్యార్థి నాయకుడిగా అతడు చూపించిన తెగువను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ అధికారం కోల్పోవల్సి వచ్చింది. అయినా కూడా ఆమె ఛాన్సలర్ పదవికి రిజైన్ చేయలేదు. అనంతరం కొద్దిరోజుల తర్వాత రాజీనామా సమర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: