దూకుడు మీదున్న రేవంతన్న.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి చూపిస్తా అంటూ సవాల్..!!

frame దూకుడు మీదున్న రేవంతన్న.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి చూపిస్తా అంటూ సవాల్..!!

murali krishna

* రేవంతన్న చెప్పాడంటే చేస్తాడంటే..
* ప్రతి పక్షాలకు చెమటలు పట్టిస్తున్న రేవంతన్న దూకుడు నిర్ణయాలు
* 9 నెలల పాలనలో ఎన్నో కీలక సంస్కరణలు..
ఎన్నో పోరాటాలు,ఎన్నో ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు.. అందరి కృషి ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జూన్ 2,2014 న ఏర్పాటు అయింది.. అదే సంవత్సరం ఆ రాష్ట్ర మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి…ఆ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చింది సోనియానే, తెచ్చింది కాంగ్రెస్ అనే ప్రచారంతో బరిలోకి దిగిన కాంగ్రెస్ అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బిఆర్ఎస్)చేతిలో ఘోరంగా ఓడిపోయింది.. దీనితో అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయ్యారు.. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కెసిఆర్ కు ప్రజలు రెండు దఫాలు అవకాశం ఇచ్చారు.. అయితే అప్పటికే తీవ్ర నిరాశలో వున్న కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి చేరడంతో పార్టీలోకి కొత్త ఉత్సాహం వచ్చింది. పార్టీని అధికారంలోకి తేవడానికి రేవంత్ రెడ్డి ఎంతగానో కష్టపడ్డారు. కాంగ్రెస్డ్ రేవంత్ పిసిసిచీఫ్ ని చేసింది.. దీనితో రేవంత్ రెడ్డి తన అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాడు.. బిఆర్ఎస్ పార్టీ పై విరుచుకుపడ్డాడు.. రేవంత్ దూకుడికి అప్పటి అధికార పక్షం హడలిపోయింది.ఎట్టకేలకు 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.. అందరూ అనుకున్నట్లే పార్టీ కోసం తీవ్రంగా కష్టపడిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సీఎంని చేసింది..

 సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నిమిషం నుంచి రేవంత్ తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ప్రజలలో ఇంకా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు..ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని కూడా చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి చూపిస్తా అని రేవంత్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: