విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ఇండిగో బంఫర్ ఆఫర్ విన్నారా?

Suma Kallamadi
సాధారణంగా భారతదేశంలో వినాయక చవితి రాకతోనే పండగల హడావుడి అనేది మొదలవుతుంది. ఇప్పటికే దేశం నలుమూలలా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా దసరా, దీపావళి కూడా రానున్నాయి. అందుకనే దూర ప్రాంతాలలో స్థిరపడిన వారు తమ సొంతూళ్లకు తిరిగి పయనానికి సిద్ధపడుతూ ఉంటారు. అయితే దూరప్రాంతాల నుంచి రావడానికి విమాన ప్రయాణం చాలా ఉపయోగంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసినదే. ఎందుకంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుంది కాబట్టి. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికుల కోసం "యాడ్ ఆన్స్ ఫియస్టా" అనే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు నెల రోజుల పాటు ఎంపిక చేసుకున్న ట్రావెల్ యాడ్ ఆన్‌లపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. పండుగలు, సెలవుల కోసం ఇంటికి వెళ్లేవారికి మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజీని అమలు చేస్తున్నట్టు సదరు సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ విమానయాన సంస్థ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్‌లు చేసుకుని ప్రయాణికులు ఈ ఆఫర్లను పొందవచ్చు. ఇండిగో ప్రవేశపెట్టిన యాడ్-ఆన్ ఫియస్టా ఆఫర్ ద్వారా విమాన ప్రయాణికులు ఈ కింద సౌకర్యాలు పొందవచ్చు.
ప్రయాణికులు తమకు నచ్చిన సీటును... కిటికీ, అదనపు లెగ్‌రూమ్ తదితర వాటిని తమ అవసరాలను అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రయాణం సాఫీగా జరగడానికి అదనపు లగేజీ భత్యాన్ని ముందస్తుగా బుక్ చేసుకొనే వీలుంది. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్యాగేజీని తీసుకువెళ్లవచ్చనే సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా వెయిటింగ్ సమయం తగ్గించడానికి, త్వరిత చెక్-ఇన్, ఫ్లెక్సిబుల్ బోర్డింగ్‌ కు వీలుంటుంది. స్ట్రీమ్‌లైన్డ్ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫాస్ట్ ఫార్వర్డ్ సర్వీస్‌లతో పాటు ఇష్టపడే సీటు, భోజనాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. మరెందుకాలస్యం.. వెబ్ సైట్ చెక్ చేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: