తెలంగాణలో గుడ్లవల్లేరు సీన్‌ రిపీట్‌..బాలికలు స్నానం చేస్తుంటే వీడియో తీసి ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దారుణాలు తెరపైకి వస్తున్నాయి. అన్ని వ్యవస్థలు... అస్తవ్యస్తం అయ్యాయని ప్రజలే చెబుతున్నారు. కరెంటు కోతలు, మంచినీటి అలాగే సాగునీటి సమస్య మొన్నటి వరకు కనిపించాయి. రుణమాఫీ పేరుతో.. సగం మంది రైతులకు కూడా చేయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత జనాల్లో కనిపిస్తుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలు కూడా అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, హాస్టల్లో దారుణ పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. మన రంగారెడ్డి జిల్లాలో... గురుకుల పాఠశాల విద్యార్థులను దారుణంగా.. కొట్టారట ఉపాధ్యాయులు. అప్పుడు విద్యార్థులంతా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడంతో పదిమంది ఉపాధ్యాయులపై వేటు వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే తాజాగా అలాంటి సంఘటన మరొకటి సిరిసిల్ల జిల్లాలో తెరపైకి వచ్చింది. ఈ సంఘటన అచ్చం గుడివాడలోని గుడ్లవల్లేరు  సంఘటన తరహాలోనే ఉంది.

గురుకుల విద్యార్థినిలు.. స్నానం చేస్తుండగా వీడియోలు కూడా తీస్తున్నారట.. PET టీచర్. దీంతో రోడ్డుపైకి వచ్చారు.. ఈ గురుకుల విద్యార్థినీలు. ఈ సంఘటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే... సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినిలు... రోడ్డు ఎక్కి ధర్నాకు దిగారు. పి ఈ టి జోష్న అనే టీచర్... తమను వేధిస్తోందని విద్యార్థులు తమ గోడును.. వినిపించారు. పీరియడ్స్ టైం లో.. ఎక్కువ సేపు స్నానం చేస్తే ఆమె తిడుతూ ఉందని... వేధిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు.
 

అంతేకాదు డోర్ పగలగొట్టి మరి స్నానం చేసే వీడియోలను రికార్డ్ చేస్తూ.. టార్చర్ పెడుతుందని సిరిసిల్ల జిల్లా తంగనపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఏకంగా 500 మంది విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు.  అలాగే 500 మంది విద్యార్థినీలకు కేవలం రెండు బాత్రూం లో ఉన్నాయని మండిపడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ బాలికలు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: