బీజేపీ: ఏపీ కొత్త చీఫ్ గా మాజీ సీఎం ..పురందేశ్వరిని తప్పించినట్టేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ బిజెపి కొత్త చీఫ్ ఎవరు అనే విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే ఈ పదవిలో ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నది. ఈమె పదవీకాలం కూడ త్వరలోనే పూర్తి కాబోతున్నది. 2022లో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఈమె బాధ్యతలను తీసుకుంది.ఆ తర్వాత బిజెపి అధ్యక్ష పదవికి రెండేళ్లు మాత్రమే ఉన్నది. పెద్ద ఎత్తున కూడ బిజెపి పార్టీ సభ్యత్వం నమోదు చేయడానికి కొత్త ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నదట. వీటితో పాటు అధ్యక్ష పదవిని కూడా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఏపీ బీజేపీకి పెద్ద సమస్య ఎదురవుతోంది అదేమిటంటే.. ఉమ్మడి ఏపీని రెండు విభాగాలుగా విభజించినప్పుడు.. హరిబాబు చీఫ్ గా ఉన్నారు.. ఆ తర్వాత మంత్రి కన్నాలక్ష్మీనారాయణకు అవకాశం ఇచ్చారు.. ఆ తర్వాత మళ్లీ సోము వీర్రాజుకు అవకాశం ఇవ్వగా.. ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తున్నది. మొత్తం మీద చూసుకుంటే నలుగురు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పవచ్చు. వీరందరూ కూడా కోస్తా ప్రాంతానికి చెందిన వారేనట. కేవలం కమ్మ, కాపు కులానికి చెందిన వారే అన్నట్లుగా తెలుస్తోంది.

బిజెపి పార్టీ విభజన తర్వాత ఆంధ్రాలో బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం వైసీపీ పార్టీకి గట్టి పట్టు ఉందని భావించి రాయలసీమ నుంచి ఒక కీలకమైన నేతను అధ్యక్ష పదవి చేయాలని చూస్తున్నారట. ఆయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి సీఎంగా పనిచేసిన( మాజీ సీఎం) నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. 2024 ఎన్నికల సమయంలో బిజెపిలో పార్టీకి చేరి రాజంపేట నుంచి లోక్సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది.. ఒకవేళ ఆయన గెలిచి ఉంటే కచ్చితంగా కేంద్రమంత్రి అయ్యేవారు అని కూడా బిజెపి వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు ఆయనకు మరొక అవకాశం బీజేపీ పార్టీ ఇవ్వాలని చూస్తోందని.. అందుకే అధ్యక్ష పదవిని ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: