ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ... వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డికి... మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11స్థానాలకే వైసిపి పడిపోయింది. అటు పార్లమెంటు స్థానాలలో కేవలం నాలుగు మాత్రమే వైసిపి దక్కించుకోగలిగింది. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం జరిగింది.
అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల పాటు.... కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచారు.కానీ ఆ విశ్వాసం లేకుండా బిజెపి మాత్రం తెలుగుదేశం కూటమిలో కలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ని వెన్నుపోటు పొడిచింది బిజెపి పార్టీ. కేంద్ర సపోర్టు ఉన్న జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు... మొన్న ఎన్నికల్లో సమర్థవంతంగా ప్రజల మధ్యలోకి వెళ్లి విజయం సాధించగలిగాయి. అటు చాలామంది ఎన్నికల అధికారులను మార్చేసి.. వైసీపీ నీ ఓడించేలా బిజెపి... గేమ్స్ ఆడినట్లు కూడా వైసిపి నేతలు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ పార్టీ మళ్లీ బిజెపిని..దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తోందట. ఇందులో భాగంగానే.... బిజెపి కూటమికి వ్యతిరేకంగా ఇండియన్ కూటమిలో చేరాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారట. అందుకే నిత్యం బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి ఉంటున్నారట. అక్కడ డీకే శివకుమార్ లాంటి నేతలతో రహస్యంగా.... తన ప్యాలస్ లో జగన్మోహన్ రెడ్డి నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారట.
అయితే.. గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు.. ఇండియా కూటమికి సంబంధించిన కొన్ని పార్టీల నేతలు... వైసీపీకి సపోర్ట్ చేయడం మనం చూసాం. అయితే ఇదంతా డీకే శివకుమార్.. చేయించారట. ఇక అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇండియా కూటమిలో చేరనున్నారట. కాంగ్రెస్తో కలిసి... బిజెపిని దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. అయితే... దానికి కొంత మేరకు సమయం పడుతుందని సమాచారం.