దివిసీమ ఉప్పెన... రియల్ హీరోగా నిలిచిన ఇందిరా గాంధీ ?

frame దివిసీమ ఉప్పెన... రియల్ హీరోగా నిలిచిన ఇందిరా గాంధీ ?

Veldandi Saikiran
* దివిసీమ ఉప్పెన నేపథ్యంలో ఇందిరా గాంధీ భారీ సాయం
* దివిసీమ ఉప్పెనతో  60 వేల మంది
* 2 లక్షల పశువులు, జంతువులు మృతి
* దివిసీమ ఉప్పెనకు 47 ఏళ్ళు

దివిసీమ ఉప్పెన అనగానే... తెలుగు ప్రజలు ఇప్పటికీ భయపడిపోతూ ఉంటారు. ఈ దివిసీమ ఉప్పెన చోటుచేసుకుని 47 సంవత్సరాలు దాదాపు పూర్తయింది. అదొక కాలరాత్రి అని ఇప్పటికీ చెబుతుంటారు పెద్దలు.నవంబర్ 19వ తేదీ 1977 సంవత్సరంలో... ఈ పెను ఉప్పెన..తెలుగు ప్రజలను ఆగం చేసింది. నవంబర్ 19వ తేదీన సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ఉరుములు అలాగే మెరుపులతో భారీ వర్షం పడుతోంది. దీంతో చూస్తూ ఉండగానే గ్రామాలన్నీ కనుమరుగయ్యాయి. ఆ పెను ఉప్పనే దివిసీమ ఉప్పెన అని ఇప్పటికి చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ దివిసీమ ఉప్పెన కారణంగా చాలా గ్రామాలు రూపురేఖలు లేకుండా పోయాయి. కేవలం రెండు గంటల్లోనే... దివిసీమ ప్రాంతం శవాల గుట్ట  లాగా తయారయిందని చెబుతూ ఉంటారు. ఊళ్లే కొట్టుకుపోయాయి.. అందులో ఉన్న జనాలు... అసలు కనిపించకుండా పోయారు.

మనుషులే చనిపోతే పశువులు అలాగే పక్షుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్షల్లో జంతువులు అలాగే పక్షులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. నీటి పైన తేలియాడుతూ పశువులు కొట్టుకుపోవడం అత్యంత దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు మళ్లీమళ్లీ రావద్దని ఇప్పటికీ కోరుకుంటారు దివిసీమ ప్రాంత ప్రజలు. అయితే ఈ పెను ఉప్పెన జరిగిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండడం జరిగింది. అయితే ఈ ప్రళయం వచ్చిన సమయంలోనే ఇందిరా గాంధీ అలర్టై దివిసీమ ప్రాంతంలో పర్యటించారు కూడా...!

నష్టపోయిన ప్రజలను ఆదుకునే ప్రయత్నం తన వంతుగా చేశారు ఇందిరాగాంధీ. ఆ బురద మట్టిలో కారు వేసుకొని... ఓ ప్రజా నాయకురాలిగా తిరిగారు ఇందిరాగాంధీ. ఈ పెను ఉప్పన కారణంగా దాదాపు 60 వేల మంది మరణించారు. దివిసీమ ఉప్పెన తర్వాత అక్కడ స్థానిక మంత్రి వెంకట కృష్ణారావు తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే... దిగివచ్చిన ఇందిరాగాంధీ... అక్కడి ప్రాంతాలను పరిశీలించి భారీ సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. దీంతో దివిసీమ ఉప్పెన గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా ఇందిరా గాంధీ పేరు అందరికీ వినిపిస్తుంది. అంతలా జనాలను ఆదుకున్నారు ఇందిరాగాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: