ఆ రెడ్డిని గెంటేసిన వైసీపీ జ‌గ‌న్‌... సాక్షి మీడియా కూడా... ?

RAMAKRISHNA S.S.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీవీ ఛానళ్లలో ఆ పార్టీ తరపున బూతుల సంప్రదాయాన్ని బాగా హైలెట్ చేసిన వ్య‌క్తి ర‌విచంద్రారెడ్డి ... సాక్షిలో రోజూ ఆయ‌న విప‌క్షాల తో పాటు విప‌క్ష నేత‌ల‌పై ఇష్టం వ‌చ్చిన‌ట్టు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చేవారు. అస‌లు ఒక్కోసారి ర‌విచంద్రారెడ్డి కామెంట్లు చూస్తుంటే చాలా అస‌హ్యం పుట్టించేలా ఉంటాయి. ఇత‌ర మీడియా ల‌తో మాట్లాడిన‌ప్పుడు ఆయ‌న బాగా రెచ్చిపోతూ ఉంటారు. అలాంటి నేత‌ను ఇప్పుడు క‌నీసం సాక్షి న్యూస్ ఛానెల్ కు కూడా రావొద్ద‌ని ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే అస‌లు వైసీపీ ఆఫీస్ గుమ్మం కూడా తొక్క కుండా చూడాల‌ని కూడా ఆదేశాలు వెళ్లి పోయాయ‌ట‌.

అంతే కాదు వైసీపీ ప్రో మీడియా సంస్థ‌ల‌కు కూడా వైసీపీ కేంద్ర కార్యాల‌య పెద్ద‌ల నుంచి అలాంటి ఆదేశాలే వెళ్లాయంటున్నారు. ఇక వైసీపీ త‌ర‌పున డిబేట్ల‌కు ఎన్నిక‌ల్లో ఎంపీ లు.. ఎమ్మెల్యేలు గా పోటీ చేసి  ఓడిపోయిన వారు ... ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. రాజ్య‌స‌భ స‌భ్యులు వీరితో పాటు పార్టీ నుంచి ఎంపిక చేసిన కొద్ది మంది మాత్ర‌మే మీడియా చ‌ర్చ‌ల‌కు పిల‌వాల‌ని వైసీపీ కేంద్ర నాయ‌క‌త్వం నుంచి అధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ క్ర‌మంలో నే ర‌విచంద్రా రెడ్డి కొద్ది రోజుల క్రితం స్వ‌యంగా జ‌గ‌న్ సొంత ఛానెల్ అయిన సాక్షి ఛానెల్లో కొమ్మినేని డిబేట్ లోనే పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొమ్మినేని ఆయ‌న్ను వారించేందుకు ప్ర‌య‌త్నించినా ఎక్కడా వెన‌క్కు త‌గ్గ‌లేదు.
ఆ షోలో ఆయన అలా మాట్లాడటంతో కొమ్మినేని వెర్రినవ్వుతో చూస్తూండిపోయాడు కానీ కట్ చేయలేని ప‌రిస్థితి.

ఆ త‌ర్వాత ఆయ‌న్ను సాక్షి మీడియాకు కాని.. వైసీపీ ప్రో మీడియా డిబేట్ల‌కు కాని పిల‌వ కూడ‌దు అని డిసైడ్ అయిపోయారు. ఈ క్ర‌మంలోనే పార్టీ కార్య‌క‌లాపాల‌కు కూడా పిల‌వ కూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: