వరదల్లో హీరోస్ : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు భారీగా పడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రం లోని ఎన్నో లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురి అయ్యాయి. ఇక వరదల్లో చిక్కుకుపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తున్న కూడా ఇంకా కొంత మంది ఇప్పటికి కూడా వరదల ద్వారా బాధపడుతూనే ఉన్నారు. ఇక వరదల్లో చెక్కుకుపోయి బాధపడుతున్న వారి కోసం ఇప్పటికే ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారికి చేతనైన అంత సహాయం చేస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఎంతో మంది హీరోలు పెద్ద మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటించారు. అలాగే ఎన్నో సినిమా నిర్మాణ సంస్థలు కూడా భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించాయి. అలాగే ఎంతో మంది మామూలు వ్యక్తులు కూడా వరదల్లో చిక్కుకుపోయిన వారికి సహాయాన్ని అందించేందుకు డబ్బులు ఇస్తున్నారు. ఇక "G H M C" కార్పొరేటర్లు కూడా తమ నెల జీతాన్ని వరద బాధితులకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. మేయర్ , డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు అంతా తమ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
మేయర్ విజయలక్ష్మి అన్ని పార్టీల కార్పొరేటర్ లతో చర్చించి ఒక నెల వేతనాన్ని సీఎం సహాయ నిధి కి ఇప్పించేందుకు కార్పొరేటర్ లను ఒప్పించారు. కష్ట కాలంలో ఉన్న ప్రజలను కాపాడేందుకు ముందుకు వచ్చిన కార్పొరేటర్ లందరికీ మేయర్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే కార్పొరేటర్లు అందరితో కలిసి మొత్తం డబ్బును సీఎం రేవంత్ రెడ్డి కి ఇవ్వనున్నట్లు మేయర్ విజయలక్ష్మి తాజాగా తెలిపారు. ఇలా "G H M C" కార్పొరేటర్లు వరద బాధితులకు పెద్ద మొత్తంలో సహాయాన్ని చేస్తుంది.