ఆ ఎమ్మెల్యే కామాంధుడు జ‌గ‌న్ రెడ్డికి స్వ‌యానా అన్నే... ప‌చ్చి నిజం ఇది..!

frame ఆ ఎమ్మెల్యే కామాంధుడు జ‌గ‌న్ రెడ్డికి స్వ‌యానా అన్నే... ప‌చ్చి నిజం ఇది..!

RAMAKRISHNA S.S.
తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కామాంధుడు అని ఒక్క‌టే వార్త‌లు.. అత‌డు ఓ మ‌హిళ‌ను లైంగీకంగా వేధించార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో వెంట‌నే ఎలెర్ట్ అయిన టీడీపీ అధిష్టానం ఆయ‌న్ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఏపీ టీడీపీ అధ్య‌క్షులు ప‌ల్లా శ్రీనివాస‌రావు యాద‌వ్ ఆదిమూలంను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక వైసీపీ మీడియా ఒక్క‌టే రెచ్చిపోయి టీడీపీ ఎమ్మెల్యే కామాంధుడు అని హెడ్డింగులు పెట్టి రాస్తోంది. వాస్త‌వానికి ఈయ‌న గారు ప‌క్కా వైసీపీ మ‌నిషి.. జ‌గ‌న్ రెడ్డి గ‌త ఐదేళ్ల‌లో ఆదిమూలం అన్నా అని ఆప్యాయంగా పిలుచుకునే మ‌నిషి.

స‌త్య‌వేడు నుంచి 2014లో వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. పేరుకు మాత్ర‌మే ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలిచినా పెత్త‌నం అంతా పెద్దిరెడ్డి గారే చేసుకున్నారు. ర‌గిలిపోయిన ఆదిమూలం పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేస్తే నీకు ఎమ్మెల్యే సీటు లేదు పో కావాలంటే తిరుప‌తి తిరుప‌తి ఎంపీగా పోటీ చేసుకో అని చెప్పారు. నేను చేయ‌ను అని చెప్పి జ‌గ‌న్‌రెడ్డి, పెద్దిరెడ్డి ఇద్ద‌రిని తిట్టి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. వెంట‌నే చంద్ర‌బాబు సీటు ఇవ్వ‌డంతో టీడీపీ ప్ర‌భంజ‌నంలో ఆయ‌న స‌త్య‌వేడు నుంచి మ‌రోసారి పార్టీ మారినా వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచారు.

ఈ ఆదిమూలం టీడీపీలోకి వ‌చ్చి అంతా నాలుగు నెల‌లు కూడా కాలేదు. ప‌క్కా జ‌గ‌న్ .. వైసీపీ వీరాభిమాని.. అన్ని ఆ పార్టీ వాళ్ల బుద్ధేలే.. స‌రే ఏదో పార్టీలోకి వ‌చ్చాడ‌న్న మాటే గాని వైసీపీ వాళ్ల కామాంధుల బుద్ధి పోలేదు. ఆ బుద్ధి ఆదిమూలంలో అలాగే కంటిన్యూ అయ్యింద‌ని వాళ్లే అనుకోవాలేమో.. ! అయితే ఆదిమూలం కామాంధుడు అని ఆరోపించిన మ‌హిళ టీడీపీ. అస‌లు ఆయ‌న‌కు సీటు ఇచ్చిన‌ప్పుడు కూడా ఆమె వ్య‌తిరేకించారు.. అయితే గెలిచాక ఆదిమూలం ప‌ట్టుబ‌ట్టి ఆమెను వేధించ‌డంతో ఆమె కూడా లొంగిన‌ట్టు న‌టించి వీడియో తీసి ఆదిమూలం అంతు చూసింది.. ఏదేమైనా ఆదిమూలం పేరుకు టీడీపీ ఎమ్మెల్యే కాని బుద్ధి అంతా వైసీపీ కామాంధుల బుద్ధే అనుకోక త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: