ఏలూరు మాజీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు బిగ్ షాక్‌... !

frame ఏలూరు మాజీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు బిగ్ షాక్‌... !

RAMAKRISHNA S.S.
- జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ భ‌ర్త గంటా ప్ర‌సాద్ వైసీపీ కి గుడ్ బై ..!
- త్వ‌ర‌లో నే ప‌సుపు లేదా జ‌న‌సేన‌ కండువా క‌ప్పుకుంటార‌ని ప్ర‌చారం .. !
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై అధికారానికి దూరమైంది.. అప్ప‌టి నుంచి వైసీపీకి వ‌రుస పెట్టి ఎదురు షాకులు త‌గులుతున్నాయి. అస‌లు పార్టీలో ఎవ‌రు ఎప్పుడు ఉంటారో ? ఎవ‌రు ఎప్పుడు బ‌య‌ట‌కు వెళ‌తారో అర్థం కాని ప‌రిస్థితి. ఇప్ప‌టికే ప‌లువురు మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. చివ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ సారి షాక్ జ‌గ‌న్‌తో పాటు ఏలూరు మాజీ ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్‌కు కూడా త‌గిలింది.
అస‌లు ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత పార్టీ అధినేత ఎంత సర్ది చెప్పినా.. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ జగన్‌కు షాక్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగలింది. జిల్లాలో సీనియర్ నేత అయిన గంటా ప్రసాద‌రావు పార్టీని విడుతున్నట్లు చెప్పేశారు. ఆయ‌న వైసీపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వంతో పాటు జిల్లా వైసీపీ ... బీసీ సెల్ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసి ఈ మేరకు రాజీనామా పత్రాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు పంపించారు.

ప్ర‌సాద‌రావు భార్య గంటా పద్మశ్రీ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి రావ‌డంలో ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ కీల‌క పాత్ర పోషించారు. ఎంపీకి వీరు అనుచ‌ర గ‌ణంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక త్వ‌రలోనే ఆమె కూడా వైసీపీకి గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భార్యభర్తలు టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: