వైఎస్ జగన్ కు ప్రాణహాని .. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక వివరాలివే!

frame వైఎస్ జగన్ కు ప్రాణహాని .. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక వివరాలివే!

Reddy P Rajasekhar

మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రాణహాని ఉందని గత కొంతకాలంగా వైసీపీ చెబుతుండగా ఆ ఆరోపణలే నిజమని వెల్లడయ్యాయి. రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ సైతం జగన్ కు ప్రాణహాని నిజంగానే ఉందని తెలిపింది. తాజా నివేదికను పూర్తిస్థాయిలో విశ్లేషించిన తర్వాత జగన్ కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగించాలని సిఫారసు చేసినట్టు రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ పేర్కొంది. అయ్యన్న పాత్రుడు, మరో టీడీపీ నేత సంభాషణకు సంబంధించిన మాటలు సైతం నిజమైందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ తెలిపింది.
 
అయితే ఈ మాటలు అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు మాట్లాడిన మాటలని తెలిపింది. జగన్ సొంత వాహనమైన టయోటా ఫార్ట్చ్యూనర్ కారును బుల్లెట్ ప్రూఫ్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చామని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ పేర్కొంది. జగన్ తనకు ప్రాణహాని ఉందని తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పాటు జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగింది.
 
ఈ ఆదేశాలపై హైకోర్టు విచారణ జరపడంతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎస్.ఆర్.సీని ఆదేశించడం గమనార్హం. హైకోర్టు ఆదేశాలకు ఎస్పీ ఎస్.నచికేత్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన విచారణను 13వ తేదీకి వాయిదా వేశారు. కౌంటర్ లో ప్రధానంగా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎల్లో బుక్ ప్రకారం జడ్ కేటగిరీ భద్రత ఉండేదని పేర్కొన్నారు.
 
జగన్ సీఎం అయిన తర్వాత దానిని జడ్ ప్లస్ కేటగిరీకి మార్చి 58 మందితో భద్రత కల్పించామని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జులై నెల 16వ తేదీన కమిటీ సమీక్ష సమావేశం జరగగా ఓడిపోయిన వారికి హోదా ఆధారిత భద్రతను తొలగించాలని జగన్ కు జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మాత్రం కొనసాగించాలని సిఫారసు చేశామని పేర్కొన్నారు. జగన్ భద్రత బాధ్యతలను డీఎస్పీకి అప్పగించామని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: