ఏపీకి HCL.. నారా లోకేష్ ప్రయత్నం సక్సెస్..!

Divya
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నారా లోకేష్ ఒక తీయటి వార్త తీసుకువచ్చారు. మొన్న ఈమధ్య మినిస్టర్ నారా లోకేష్ హెచ్ సి ఎల్ యజమానితో కూర్చొని మారి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు కావాలని.. యువతలో అనేకమంది మీ సంస్థకు సంబంధించి యువత వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మా ఆంధ్ర వాళ్ళే అక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయడం జరుగుతోంది .కానీ మా ఆంధ్రలోనే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇక్కడే సంస్థ ఏర్పాటు  చేయాలని కోరారు.. అంతేకాకుండా అలా చేయాలంటే ఎంత కావాలి అంటే అంత భూమి ఇస్తామని ప్రకటించారట.

అయితే ఇప్పుడు తాజాగా అందుకు తగ్గట్టుగా కొత్త అడుగులు పడడం హెచ్ సి ఎల్ సంస్ధ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి తమ సంస్థ విస్తారణకి. తన క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి హెచ్ సి ఎల్ సి సంస్థ రెడీ అయింది. అలాగే ఎస్ పి ఎల్ తన క్యాంపస్ ని ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారట. 15 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమయ్యా మంటూ కూడా ప్రకటించారట. ఇది చాలా అద్భుతమైనటువంటి పని. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి సాధించినటువంటి అతిపెద్ద ఘనత నారా లోకేష్ కి వెళుతుంది.

హెచ్ సి ఎల్ సమస్థకు ఇది ఎక్స్పెన్షన్ అయినప్పటికీ కానీ మన పరంగా మాత్రం కొత్త వ్యవస్థ అవుతుందని చెప్పవచ్చు. లోకేష్ ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. మరి ఇందుకు సంబంధించి అన్ని పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని కూడ హెచ్ సి ఎల్ సమస్త తెలియజేసింది. మరి నిరుద్యోగులకు కూడా ఏదో ఒక గుడ్ న్యూస్ లాంటిది. గతంలో ఎన్నికల ముందు నారా లోకేష్ ప్రతి ఏటా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగం లేకుండా చేస్తామని తెలియజేశారు. అందుకు తగ్గట్టుగానే ఆ వైపుకు అడుగులు వేస్తున్నట్టు ఇప్పుడు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: