వరద బాధితులను తిట్టిన వైసీపీ టాప్ లీడర్.. గో బ్యాక్ అంటూ షాక్ ఇచ్చిన విజయవాడ ప్రజలు..!
ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాల్సింది పోయిన ప్రధాన ప్రతిపక్షం వైసిపి.. వరద రాజకీయం చేస్తూ.. ప్రజలతో ఛీ కొట్టించుకుంటుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సైతం వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చి.. బుడమేరు వాగు కాదు.. బుడమేరు నది అని అభాసు పాలయ్యారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వరద బాధితులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులందరూ కలిసి ఆ నాయకుడిని బయటకు పంపేశారు. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ.. వైసిపి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు బుధవారం వరద బాధితులను పరామర్శించేందుకు.. కంచికచర్ల వద్దకు వెళ్లారు.
బాధితులకు సరిగా సాయం అందించడం లేదంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బాధ్యతలు తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటూ చెప్పే ప్రయత్నం చేయబోగా.. వారిపై మాజీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించారు. నాలుగు రోజులుగా కూటమి నాయకులు అన్ని విధాలుగా సాయం అందిస్తుంటే.. ఇప్పుడు వచ్చి బురద రాజకీయం ఏంటని బాధితులు అందరూ ఆయనపై తిరగబడే ప్రయత్నం చేశారు. మొండితోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ జగన్మోహన్ రావును అక్కడ నుంచి పంపించి వేశారు. దీంతో వైసిపి నేత పరువు కాస్త పోయింది.