టిడిపి కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి వైఎస్ఆర్సిపి నాయకులకు సంబంధించిన ఎన్నో అరాచకాలు బయటపడ్డాయి. ఇందులో భాగంగా ఎంతోమంది రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయటపడ్డాయి. కొంతమంది న్యూడ్ వీడియోస్ కూడా బయట పడుతున్నాయి.అలా సజ్జల,విజయ్ సాయి రెడ్డి,గోరంట్ల మధుసూదన్, దువ్వాడ శ్రీనివాస్ ఇలా ఎంతోమంది వైయస్ఆర్సీపీ రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయటపడ్డాయి. అయితే చాలా రోజులుగా వైఎస్ఆర్సిపి రాజకీయ నాయకుల అఫైర్స్ ఏపీ రాజకీయాల్లో దుమారం సృష్టిస్తున్న వేళ తాజాగా టిడిపి ఎమ్మెల్యే కి సంబంధించిన న్యూడ్ వీడియో మీడియాలో కలకలం రేపుతుంది.టిడిపి మహిళ నేతతో ఆయన చేస్తున్న సెక్స్ వీడియోని ఆ మహిళ మీడియా కి అందించింది. దాంతో ఆ టిడిపి ఎమ్మెల్యే బాగోతం కాస్త బయటపడింది. ఇక విషయంలోకి వెళ్తే..సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు కి సంబంధించిన టిడిపి మహిళా నేతని గత కొద్దిరోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించి లైంగికంగా వాడుకున్నాడట.
అయితే ఈ విషయంలో ఆ మహిళ భర్త కలగజేసుకొని ఎమ్మెల్యే ఎందుకు నీకు పదేపదే వీడియో కాల్,ఆడియో కాల్ చేస్తున్నాడని అడగగా నన్ను ఆయన చాలా రోజుల నుండి బెదిరిస్తున్నాడు అని చెప్పిందట.రూలింగ్ పార్టీలో ఉన్నాడు కాబట్టి లొంగి పోక తప్పదు అని హోటల్ రూమ్లో కోనేటి ఆదిమూలం దగ్గర ఆ మహిళ లొంగిపోయిందట. అంతేకాదు ఈయన బాగోతం మొత్తం బయట పెట్టాలని వాళ్ళిద్దరూ సెక్స్ చేసే వీడియోని ఫ్రంట్ కెమెరాతో చిత్రీకరించి ఆ వీడియోని మంగళగిరి ఆఫీస్ లో అప్పజెప్పిందట. కానీ లొకేష్ నుండి చంద్రబాబు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మీడియాకి ఈ వీడియోని అందించింది. ఇక మీడియాతో ఆ భాదిత మహిళ మాట్లాడుతూ.. సత్యవేడులో చాలామంది కోనేటి ఆదిమూలం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేసి తెల్లగా ఉన్న ఎవరైనా అమ్మాయిలు ఉంటే నాకు చెప్పు నాకు ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ ఇవ్వు అని నన్ను టార్చర్ పెట్టేవాడు. అంతేకాదు ప్రతిసారి వీడియో కాల్, ఆడియో కాల్ చేసేవారు.నేను ప్రతిసారి రిజెక్ట్ చేసిన కూడా నేను లిఫ్ట్ చేసే వరకు ఆయన అలా చేస్తూనే ఉండే కారు. ఇక వీడియో కాల్ చేస్తే మాత్రం నా బట్టలన్నీ విప్పేసి చూపించమనేవాడు.
ఇక ఆయన టార్చర్ భరించలేక ఎలా అయినా సరే ఈ విషయం బయట పడాలని నేను ఆ వీడియో చిత్రీకరించాను. నాలా ఇంకో అమ్మాయి బలి కాకూడదు అనే ఉద్దేశంతోనే నా బతుకు ఏమైపోయినా పర్వాలేదు అని మీడియాకి ఈవిషయం చెప్పాను. నేను కేవలం ప్రాణభయంతోనే లొంగి పోవాల్సి వచ్చింది.సైకో లాగా నాకు ఫోన్ చేసి పదేపదే టార్చర్ చేసేవాడు.నేను చంద్రబాబుని టిడిపి పార్టీని కించపరచడం కోసం ఇలా చేయట్లేదు. కేవలం నాలా ఇంకొకరు బలి కాకూడదని, నాకు న్యాయం కావాలని ఈ వీడియో చిత్రీకరించాను. ఆదిమూలం నుండి నాకు ప్రాణహాని ఉంది.. అంటూ భాధిత మహిళ మీడియాతో చెప్పింది.అంతేకాదు ఎంతోమంది మహిళలు ఆయన కామానికి బలైపోతున్నారని దీనిపై యాక్షన్ తీసుకొని వెంటనే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేయాలని,ఒకవేళ సస్పెండ్ చేయకపోతే నేను నా ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామంటూ భాధిత మహిళ మీడియాతో చెప్పింది.ఇక ప్రస్తుతం కోనేటి ఆదిమూలం మహిళతో చేసిన సెక్స్ వీడియో మీడియాలో దుమారం సృష్టిస్తుంది