హైదరాబాదీలకు మూసి ముప్పు..!

Pandrala Sravanthi
- కాలుష్యంతో  మూసి ముక్కు మూసుకుంటోంది..
- కబ్జా కోరల్లో చిక్కి తల్లడిల్లుతోంది..
- మూసిని కాపాడేవారు లేరా.?


హైదరాబాదులో నదుల పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది మూసీ నది మాత్రమే. అలాంటి ఈ నది మూచుకుందా మహానది అనే పేరుతో పుట్టిన ఈ నది కాలక్రమేనా మూసినదిగా మారింది. ప్రస్తుతం ఈ నదే హైదరాబాద్ అంతటా ప్రవహిస్తోంది. అలాంటి ఈ నది వర్ష కాలం వచ్చిందంటే చాలు హైదరాబాదీలను భయం గుప్పిట్లో గడిపేలా చేస్తోంది. మూసి నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టింది. అనంత పద్మనాభ స్వామి కోనేరు నుంచి ప్రారంభమై హైదరాబాదుకు చేరుకుంటుంది. అలాంటి ఈ మూసి నది ఒకప్పుడు తాగునీటి అవసరాలను తీర్చేది. అలాంటి మూసీ నదికి ఉపనదిగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ నిర్మించబడింది. అలాంటి ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అలాంటి మూసి నది ఒకప్పుడు ఎంతో స్వచ్ఛమైన నీటితో ఉండేదట. అందులో ఒక రూపాయి కాయిన్ వేస్తే కూడా కనిపించేదట. అయితే ఆ మూసినదే ఇప్పుడు మురికి కూపంలా మారింది. మొత్తం హైదరాబాదీలను రోగాల బారిన పడేస్తోంది. హైదరాబాదులోని చెత్తాచెదారం మురికి నీరంతా ఆ నదిలోకే చేరుతోంది. స్వచ్ఛమైన నీరు కాస్త కలుషిత నీరుగా మారిపోయింది.
 మూసి తో హైదరాబాదీలకు ముప్పు :
ఒకప్పుడు హైదరాబాదులో ఎక్కడికక్కడ చెరువు, కుంటలు ఉండేవి. వర్షాలు పడితే ఆ నీరంతా చెరువులు కుంటల్లోకి చేరేది దీంతో హైదరాబాదు ప్రజలు సేఫ్ గా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆ చెరువులను, కుంటలను, కాలువలు అన్నింటిని కబ్జా దారులు ఆక్రమించేశారు. దీంతో చిన్న వర్షం పడినా చాలు, ఆ నీరు అతలాకుతలమై ఎక్కడి వెళ్లాలో తెలియక సిటీలోనే నిలిచిపోతోంది. ఒకప్పుడు చిన్న చిన్న కాలువలు అన్ని కలిసి చివరికి మూసిలో కలిసేవి. అలా ప్రస్తుత కాలంలో అన్ని కాలువలను ఆక్రమించడంతో మూసి నదిలోకి నీరంతా అస్తవ్యస్తంగా చేరుతూ మురికి కూపంలా మారుతుంది. ఇలాంటి మూసి నది ప్రస్తుతం దారుణంగా తయారైపోయింది. హైదరాబాదు నలుమూలల నుంచి రసాయనాలు ఈ నదిలోకి వదులుతున్నారు. నదిలోకి నిత్యం 140 కోట్ల లీటర్ల వ్యర్ధ జలాలు వస్తున్నాయి. అంతేకాకుండా నది వెంబడి ఉన్నటువంటి బస్తీలు, కాలనీ వాసులంతా నిత్యం రోగాలతో సతమతమవుతున్నారు. అలాంటి మూసి మురికి కూపంగా మారడంతో వర్షాకాలం వచ్చిందంటే మూసినది పూర్తిగా నిండి ఆ నీరంతా హైదరాబాదును ముంచెత్తుతోంది. ఈ మురికి నీరు అంతా హైదరాబాదును చుట్టి ముట్టడంతో వర్షాకాలంలో హైదరాబాదులు చాలావరకు రోగాల బారిన పడుతున్నారు. ఎక్కడికక్కడ చెత్త మేటలు తీసుకువచ్చి సిటీలో వదిలేస్తోంది. దాన్ని క్లీన్ చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన నీరుతో ఉన్నటువంటి మూసీని ఇలా మురికిగా మార్చడంతో ప్రజలకు, ఇటు పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మూసి నది తీర ప్రాంతాలలో అక్రమలు చేస్తూ ఇప్పటికే వందల ఎకరాలను ఆక్రమించారు. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. దీంతో మూసికి వచ్చే నీరంతా నిల్వ ఉండలేక, దాని నిలువ సామర్థ్యం సరిపోక నీరంతా సిటీలోకి చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
 మూసిని పట్టించుకోరా?
ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మూసిని సుందరంగా చేస్తామని చెబుతూనే ఉన్నారు తప్ప చేసింది లేదు ప్రజలు చూసింది లేదు. వందల కోట్లు మూసి కోసం కేటాయిస్తారు కానీ పనులు ఎక్కడ వేసిన గొంగడి అనే విధంగా తయారయ్యాయి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన మూసి నదిపై ప్రక్షాళన చేసి ఉన్న చెత్తనంతా క్లీన్ చేసి అందులోకి వచ్చే మురుగునీటిని రాకుండా చేయాలి. అంతేకాకుండా ప్రస్తుతం సిటీలో కొరడా విసురుతున్నటువంటి హైడ్రా మూసినదిని ఆక్రమించిన వారిపై కూడా కొరడా విసిరి, మూసి నదిని కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విధంగా మూసిని పూర్తిగా క్లీన్ చేస్తే హైదరాబాద్ చాలా వరకు సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: